Viral Video: ఇటీవల సోషల్ మీడియా రీల్స్ కి పిచ్చ క్రేజ్ ఉందనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు కూడా. కొన్నిసార్లు ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవల పలువురు యువకులు, రైళ్లలో రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే పలువురు రీల్స్ తో పాపులర్ గా మారిన లైఫ్ సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్నారు. మరికొంత మంది రీల్స్ పిచ్చితో ఏమి చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో.. వారనుకున్న రీతిలో రీల్స్ చేసేస్తూ.. వివాదాలు మూటగట్టుకుంటున్నారు. సేమ్ టు సేమ్ అలాంటిదే ఈ ఘటన. సైనికుల త్యాగాలకు నిలయంగా మారిన ఇండియా గేట్ ముందు అర్ధనగ్న డ్యాన్సులు చేసి, ఓ యువతి రీల్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది.
న్యూఢిల్లీ లో గల ఇండియా గేట్ అంటేనే మన సైనికుల త్యాగానికి ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన 90 వేల మంది ఆర్మీ జవాన్ల త్యాగానికి చిహ్నంగా ఇండియా గేట్ ను నిర్మించారు. ఢిల్లీ కి వెళ్లిన ఎవరైనా.. ఈ గేట్ ను చూడనిదే తమ పర్యటనకు ముగింపు పలకరు. అటువంటి ఇండియా గేట్ నుండి నేరుగా మనం రాష్ట్రపతి భవన్ కూడా చూసే సదుపాయం కూడా ఉంది. అంతటి చరిత్ర కలిగిన ఇండియా గేట్ ఎదురుగా, ఓ యువతి అర్థనగ్నంగా రీల్స్ చేసి, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
Also Read: Lady Aghori: అఘోరీ నోట భవిష్యవాణి.. చుట్టుముట్టిన భక్తులు.. అసలేం చెబుతోందంటే?
కోల్ కతాకు చెందిన సన్నాటి మిత్ర అనే యువతి ఇండియా గేట్ వద్దకు చేరుకుంది. రీల్స్ చేసే అలవాటు గల మిత్ర, గేట్ ఎదురుగా నిలబడి కేవలం ఒంటి పై టవల్ మాత్రమే ధరించి రీల్స్ చేసింది. ఈ రీల్ చేయడమే గాక, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఎందరో సైనికుల ప్రాణత్యాగానికి చిహ్నంగా గల ఇండియా గేట్ ముందు అలా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే తమదైన స్టైల్ లో ట్రోలింగ్ కూడా చేసేస్తున్నారు.
ఇటువంటి రీల్స్ ఇండియా గేట్ వద్ద చేయకుండా.. కోల్ కతా లో చేస్తే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారని కూడా నెటిజన్స్ సూచిస్తున్నారు. రీల్స్ వివాదం తో పోలీసులు కూడా ఆమె వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకే ఏదైనా హద్దు మీరవద్దు.. గీత దాటవద్దని అంటారు పెద్దలు.
ఇండియా గేట్ ముందు యువతి అర్ధనగ్న డ్యాన్సులు
ఒంటిపై టవల్ మాత్రమే ధరించి రీల్స్ చేసిన కోల్‌కతాకు చెందిన సన్నాటి మిత్ర
సైనికుల ప్రాణత్యాగానికి చిహ్నమైన ఇండియా గేట్ ముందు అలా చేయడంపై విమర్శలు
ఇలాంటి పనులు కోల్‌కతాలోనే చేసుంటే బావుండేది అంటున్న నెటిజన్లు@adgpi… pic.twitter.com/UpCMelPL0u
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024