E-Paper
Advertisement

Deputy CM Controversial Comments: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

Deputy CM Controversial Comments: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
Advertisement

UP Deputy CM Controversial Comments: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో కూడా వీరి మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే, కేశవ్ ప్రసాద్ తాజాకా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బలంతో బీజేపీ ఎన్నికలు గెలువలేదంటూ పేర్కొన్నారు.

సోమవారం యూపీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, యూపీలోని ఆ పార్టీ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఆయన స్పష్టం చేశారు. వర్తమానం, భవిష్యత్ బీజేపీదేనని ఆయన అన్నారు. అయితే, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మనం అంతగా రాణించలేకపోవొచ్చు.. కానీ వచ్చేసారి మరింత బలంతో తిరిగి వస్తామంటూ ఆకాంక్షించారు. ఇందుకోసం మనం మరింతగా కష్టపడాల్సి వస్తుందంటూ ఆయన బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంలో మనం చిక్కుకుపోయాం. ప్రభుత్వ బలంతో ఎన్నికల్లో గెలువలేదని నేను స్పష్టం చేస్తున్నా. ఎన్నికల్లో పోటీ చేసేది పార్టీనే.. గెలిచేది కూడా పార్టీనే. అందువల్ల 2027లో మనం మరింతగా బలపడాల్సిన అవసరం ఉంది’ అంటూ మౌర్య వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

అయితే, సీఎం ఆదిత్యనాథ్ తో విభేదాలున్న కేశవ్ ప్రసాద్ ఈ నెల 17న వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కంటే పార్టీనే పెద్ది. పార్టీ కంటే ఎవరు కూడా పెద్దవారు కాదు. అందుకే చెబుతున్నా కార్యకర్తల బాధ నా బాధే. కార్యకర్తలే పార్టీకి గర్వకారణం అంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అప్పుడు భారీ చర్చకు దారి తీసింది. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయనను పిలుపించుకుని మాట్లాడినట్లు తెలిసింది.

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×