E-Paper
Advertisement

Shiva Lingam : వినాయకుడి చేతిలో శివలింగం

Shiva Lingam : వినాయకుడి చేతిలో శివలింగం
Advertisement

Shiva Lingam : ఏ పూజ అయినా తొలుత పూజలందుకునేది వినాయకుడే. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడి పూజతోనే ఏ కార్యక్రమం అయినా మొదలవుతుంది. తమిళనాడులోని పిళ్లైయార్ పట్టి వినాయక క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాడు గణనాథుడు. తిరుప్పత్తూరు సమీపంలోని ఈఆలయం సువిశాలంగా నిర్మించారు. నాటి వైభవానికి అద్దం పడుతూ. స్వామివారి మహిమలకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. ఎత్తైన గాలిగోపురం, వివిధ ఉపాలయాలు .. మంటపాలతో ఈ ప్రాంతం అడుగడునా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.

Advertisement

సాధారణంగా వినాయకుడు .. ఒక చేతిలో ఉండ్రాయిగా చెప్పుకునే లడ్డు పట్టుకుని కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో స్వామివారి చేతిలో శివలింగం ఉంటుంది. వినాయకుడి చేతిలో శివలింగం వెనుక పెద్ద కథే ఉంది. శివుడి వరంతో తనను ఎవరూ చంపలేరన్న గర్వంతో గజముఖాసురుడు రెచ్చిపోయి ఆగడాలు సృష్టిస్తాడు. దేవతల్నిసైతం వదలడు. చివరకి సమస్త దేవతల వినాయకుడి వద్దకి వెళ్లి తమ బాధను చెప్పుకుంటారు. అసురుడు వినాయకుడితో యుద్ధం సమయంలో చిక్కడు దొరకడు అన్నట్టు కాసేపు ఆడుకుంటున్నాడు. చివరకు ఎలుక రూపంలో పారిపోవడానికి ప్రయత్నించి చనిపోతాడు. ఆ సమయంలో తనకు వినాయకుడి వాహనంలా ఉండేందుకు వరం ఇవ్వమని కోరతాడు. విఘ్వేశ్వరుడి అనుగ్రహంతో అతని కోరిక నెరవేరుతుంది.

గజముఖాసురుడిని చంపిన దోష నివారణకి వినాయకుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అసుర సంహారం చేసిన ఇక్కడి స్వామిని కర్పగా వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా సాగిపోతుందని భక్తుల విశ్వాసం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×