BigTV English

Ott Releases: ఓటీటీలోకి ‘కస్టడీ’.. ఈవారం ఇంకా మరికొన్ని..

Ott Releases: ఓటీటీలోకి ‘కస్టడీ’.. ఈవారం ఇంకా మరికొన్ని..
ott

OTT releases this week telugu(Today’s entertainment news) : నాగచైతన్య పోలీస్ యూనిఫాంలో కనిపించిన మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ బాషల్లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఫ్లాప్ టాక్‌తో థియేటర్లకు వెళ్లని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో కస్టడీని చూసేయొచ్చు. పోలీస్ మూవీస్ అంటే ఇష్టపడే ఆడియన్స్ సైతం ఓ లుక్ వేసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది కస్టడీ.


ఓటీటీలో ‘2018’, ‘అవతార్-2’ హవా..
రోహిణీ కార్తె ఎండలకు భయపడి.. ఇంట్లో ఉంటున్న వాళ్లకు ఓటీటీనే పెద్ద టైంపాస్. అందులో ఇటీవలే రిలీజ్ అయిన ‘2018’, అవతార్2 సినిమాలతో క్రేజ్. కేరళ వరదల స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ‘2018’ మూవీ.. స్ట్రీమింగ్‌లో దూసుకుపోతోంది. టోవినో థామస్ తదితరులు నటించిన.. మంచి రేటింగ్ మూవీ కావడంతో.. సోనీలివ్‌కు హిట్స్ పెరిగాయి. తెలుగు, మలయాళ, కన్నడ, తమిళభాషల్లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.

‘2018’తో పాటు జేమ్స్ కెమెరూన్ తీసిన విజువల్ వండర్, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అవతార్‌ 2’ సైతం ఓటీటీలో దుమ్ము రేపుతోంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.


‘ఆహా’లో ‘మెన్‌టూ’..
‘#మెన్‌టూ'(#Mentoo). ‘బీయింగ్‌ ఏ మ్యాన్‌ ఈజ్‌ నాట్‌ ఈజీ’ అనేది ట్యాగ్ లైన్. గత వారమే.. థియేటర్లలో రిలీజైంది. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్‌ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌:

ఆర్నాల్డ్‌ (వెబ్‌సిరీస్‌)
నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ (వెబ్‌సిరీస్‌)
టూర్‌ డి ఫ్రాన్స్‌(వెబ్‌సిరీస్‌)
బర్రకుడ క్వీన్స్‌ (వెబ్‌సిరీస్‌)
బ్లడ్‌ హౌండ్స్‌ (కొరియన్‌ సిరీస్‌)

అమెజాన్‌ ప్రైమ్‌:
కస్టడీ
మై ఫాల్ట్‌ (హాలీవుడ్‌)

జీ5:
ది ఐడల్‌ (వెబ్‌సిరీస్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌:

ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (హాలీవుడ్)
ఫ్లామిన్‌ హాట్‌ (హాలీవుడ్‌)
సెయింట్‌ ఎక్స్‌ (వెబ్‌సిరీస్)

జియో సినిమా
బ్లడీ డాడీ (హిందీ)
యూపీ 65 (హిందీ సిరీస్‌)

యాపిల్‌ టీవీ ప్లస్‌
ది క్రౌడెడ్‌ రూమ్‌ (వెబ్‌సిరీస్‌)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×