E-Paper
Advertisement

HouseWarming:- గృహప్రవేశం చేసేటప్పుడు కవ్వాన్ని తీసుకెళ్లాలా?

HouseWarming:- గృహప్రవేశం చేసేటప్పుడు కవ్వాన్ని తీసుకెళ్లాలా?
Advertisement

HouseWarming:- పూజ గదిలో ఒక వస్తువు కనుక ఉందీ అంటే, ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు అని పెద్దలు చెబుతూఉంటారు.అంత అత్యత్భుతమైనటువంటి సిరిసంపదలను కలిగించేటటువంటి వస్తువు కవ్వం. అందుకే మీరు గమనిస్తూ ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటటువంటివారు కవ్వాన్ని కూడా పూజా సామగ్రి తో పాటుగా తీసుకుని వెళుతూ ఉంటారు.
కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి. ఏ ఇంట్లో అయితే కవ్వం ఉందో ఆ ఇంట్లో పెరుగు ఉందీ అని అర్ధం. కవ్వం ఉన్నది పెరుగు చిలకటానికే కాబట్టి. పెరుగు ఉందీ అంటే పాలు ఉన్నాయి అని అర్ధం. పాలు ఉన్నాయీ అంటే ఆ ఇంట్లో పశుధనం ఉందీ అని అర్ధం.

పశుధనం ఉందీ అంటే వారికి పొలం ఉందీ అని అర్ధం. పొలం ఉందీ అంటే వారికి సిరిసంపదలు ఉన్నాయీ అని అర్ధం.ఎందుకంటే పాలు, పెరుగు, సిరిసంపదలు ఏమి లేనివారికి కవ్వంతో పని ఏమీ ఉండదు కాబట్టి కవ్వం ఇంత విశేషమైనటువంటి లాభాన్ని మీకు కలిగిస్తుంది. ఒక చెక్క కవ్వాన్ని మీరు పూజగదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా స్టీలు కవ్వాన్నీ, ఇనుపకవ్వలూ అల్యూమినియం కవ్వాలను అస్సలు పెట్టకూడదు. ఒక చెక్క కవ్వాన్ని కొనుక్కుని దానికి కొంచెం గంధం,కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది.

Advertisement

లక్ష్మీదేవి ఆ కవ్వం రూపంలో వారి ఇంట్లో ఉందీ అంటే వారికి సిరిసంపదలు కలిగి తీరుతాయి అని గుర్తు. కాబట్టి ఖచ్చితంగా మీ పూజ గదిలో కవ్వాన్ని ఉంచండి.అదేవిధంగా వీలైతే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఆ చెక్క కవ్వంతో పెరుగును చిలకండి. ఏ ఇంట్లో అయితే పెరుగు చిలుకుతారో ….? ఏ ఇంట్లో అయితే కవ్వం పెరుగులో తిరుగుతూ తిరుగుతూ శబ్దం వస్తుందో ఆ శబ్దం లక్ష్మీదేవి ఆహ్వానానికి సంగీత సంకేతమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని కవ్వంతో మీ ఇంట్లోకి ఆహ్వానించండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×