BigTV English

IPL : ఉత్కంఠగా ఐపీఎల్ మ్యాచ్ లు.. చివరి బంతికే ఫలితాలు..

IPL : ఉత్కంఠగా ఐపీఎల్ మ్యాచ్ లు.. చివరి బంతికే ఫలితాలు..

IPL Match Updates : ఐపీఎల్ -2023 సీజన్ లో కొన్ని మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు మజాను ఇస్తున్నాయి. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్ లు సాగుతున్నాయి. గత నాలుగు మ్యాచ్ ల్లో 3 మ్యాచ్ ల్లో చివరి బంతికే ఫలితం తేలింది. తాజాగా ముంబై – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న ముంబై చివరి బంతికి రెండు పరుగులు తీసి అతి కష్టంమీద విజయాన్ని అందుకుంది. ఆదివారం గుజరాత్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలానే సాగింది. కోల్ కతా విజయానికి చివరి బంతికి 4 పరుగులు అవసరంగా కాగా.. రింకూ సింగ్ సిక్సర్ బాది ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. సోమవారం బెంగళూరుపై లక్నో కూడా చివరి బంతికి సింగిల్ తీసి గెలిచింది. కోల్ కతా , లక్నో జట్లు 200 పరుగులపైగా లక్ష్యాన్ని చేధించాయి. ఈ మూడు మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇచ్చాయి. మూడు మ్యాచ్ ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం విశేషం.


మంగళవారం జరిగిన ముంబై-ఢిల్లీ మ్యాచ్ ఇరు జట్ల ఇన్నింగ్స్ లో ఆఖరి రెండు ఓవర్లలే ఫలితాన్ని మార్చేశాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51, 47 బంతుల్లో 6 ఫోర్లు) , అక్షర్ పటేల్ ( 54, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో ఢిల్లీ ఒక దశలో 200 పరుగులు చేసేలా కనిపించింది. అయితే అనూహ్యంగా చివరి రెండు ఓవర్లలో 7 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయింది. 19 ఓవర్ లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. బెరెన్ డార్ఫ్ , పియూష్ చావ్లాకు మూడేసి వికెట్లు, మెరిడియత్ కు 2 వికెట్లు దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. కెప్టెన్ రోహిత్ ( 65, 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు), ఇషాన్ కిషన్ (31, 26 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్ కు 71 పరుగులు జోడించారు. ఇషాన్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ చెలరేగి పోయాడు ( 41, 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులు ) దీంతో ముంబై విజయం లాంఛనమే అనిపించింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ( గోల్డెన్ డక్ ), రోహిత్ శర్మ వెంట వెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ రేగింది.


క్రీజులో పవర్ హిట్టర్లు కామెరూన్ గ్రీన్ ( 17 , 8 బంతుల్లో ఫోర్ , సిక్సు), టిమ్ డేవిడ్ (13, 11 బంతుల్లో సిక్సు) ఉండటంతో ముంబైకే విజయాకాశాలు ఎక్కువగా కనిపించాయి. ముస్తాఫిజుర్ రెహ్మన్ చేసిన 19 ఓవర్ లో రెండు సిక్సలు రావడంతో ముంబై విజయం ఖాయమైంది. చివరి ఓవర్ లో 5 పరుగులే చేయాల్సిన సమయంలో ఢిల్లీ బౌలర్ నోకియా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ముంబై విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ లో 5వ బంతికి, 6 బంతికి రనౌట్ అవకాశాలను ఢిల్లీ వృథా చేయడంతో మ్యాచ్ ను చేజార్చుకుంది. దీంతో ముంబై ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ ల్లో నూ ఓటమిని చవిచూసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన రోహిత్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Big Stories

×