E-Paper
Advertisement

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?
Advertisement

Bigg Boss Kalyan Padala: ఒకప్పుడు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు.. ఈ షో ఏ రేంజ్ లో ఉపయోగపడిందో స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ.. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి సోషల్ మీడియా ఆదరణ భారీగా పెరిగిపోయిన తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి వరుస అవకాశాలు తలుపు తడుతూ వారి స్థాయిని మరింత పెంచేస్తున్నాయి. అలా అగ్ని పరీక్షలో తమ సత్తాచాటి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కామనర్స్.. ఇప్పుడు ఏకంగా షోలు, సినిమాలు అంటూ బిజీగా మారడంతో బిగ్ బాస్ వీరి కెరీర్ కు ఏ విధంగా దోహద పడిందో అర్థం అవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9లో తమదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన డెమోన్ పవన్ (Demon Pawan) ఇప్పుడు మరో షోలు, ఆల్బమ్ సాంగ్ లు చేస్తూ బిజీగా మారగా.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల (Kalyan padala) హీరోగా అవకాశం అందుకున్నారు.

హీరోగా కళ్యాణ్ పడాల తొలి అడుగు..

వింధ్యా ఫిలిం ప్రొడక్షన్స్ పతాకం పై జి.సంతోషి రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ హేమంత్ కృష్ణ (Hemanth krishna) తెరకెక్కించనున్న కొత్త హారర్ కామెడీ చిత్రం ఫన్ (Fun). తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించారు. నవ్వులతో పాటు ఆధ్యంతం భయపెట్టే థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ కథను కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మలుస్తున్నారు.

నవంబర్ 12 నుండి షూటింగ్ ప్రారంభం..

Advertisement

ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుండి శరవేగంగా ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమయ్యింది. చిత్రీకరణను ఏకధాటిగా పూర్తి చేసి.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడంటే?

ఇందులో కళ్యాణ్ పడాల సరసన సాహితీ(Sahithi ) హీరోయిన్గా నటిస్తుండగా. రవి శివతేజ, అజయ్ ఘోష్, సోనియా నాయుడు, వి యశోర , బేబీ జశ్విత, మాస్టర్ హనీష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. జి.ఎల్. బాబు సినిమాటోగ్రాఫర్ గా, క్రాంతి ఆర్కే ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ క్రేజ్ కి తగినట్లుగా సరికొత్త హంగులతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వంటి క్రేజీ అప్డేట్లను వరుసగా త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తుండడం గమనార్హం.

Advertisement

also read: శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

హీరోగా తొలి ప్రయత్నం..

మొత్తానికైతే బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత కొంతకాలం సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఈయన.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు సడన్గా హీరోగా అవతారమెత్తి మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. మరి కళ్యాణ్ పడాల తొలి ప్రయత్నానికి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.

Related News

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చిన సుమిత్ర   

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

Big Stories

Advertisement
×