
Pradakshan : సహజంగా మనం దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ తర్వాత గుడి యొక్క గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షణము అంటారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది .సాధారణంగా దేవాలయాలకు ఆలయాలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
దేవుడి నామస్మరణ చేసి ఆలయంలో కొన్ని క్షణాల్లు అయినా ప్రశాంతంగా కూర్చొని భగవంత నామ స్మరణ చేసుకుంటూ ఉంటారు. గ్రహాచారాలు బాగా లేకపోయినా , అరిష్టాలు ఏర్పడినట్టు భావించినా…గుడిలో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా పరిహారాలకు పరిష్కార దొరుకుతుంది . ప్రదక్షిణలు శ్రద్ధతో చేతులు జోడిస్తూ చేయమని శాస్త్రం చెబుతోంది.
నియమిత సంఖ్యలోనే ప్రదక్షిణలు చేయాలి. ప్ర అంటే పాప నాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చుట, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుంచి విమోచనమ, ణ అనగా జ్ఞానం ద్వారా ముక్తి మార్గంలో పయనించాలి ముక్తిని ప్రసాదించాలని అర్థం. కుడి వైపు శుభప్రదతకి సంకేతం. ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. గర్భాలయం కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణం చేయడం వల్ల అన్ని వేళలా సాయం, శక్తి, మార్గదర్శకం ఇచ్చి భగవంతుడు సన్మార్గంలో నడిపిస్తాడనే నమ్మకం.
భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.
సాధారణంగా కూడా మనకు కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండదు. అందుకే మనం కుడివైపున అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐటమ్స్ పెట్టుకుని, ఎడమ వైపున తక్కువ ప్రాధాన్యతం ఉన్న వాటిని పట్టుకుంటాం. తీసుకుంటాం. ప్రదక్షిణం కుడి వైపునకు చేయడం వల్ల మేలు జరుగుతుందట.