BigTV English

MI VS PBKS:- పోరాడి ఓడిన ముంబై… మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పంజాబ్

MI VS PBKS:- పోరాడి ఓడిన ముంబై… మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పంజాబ్

MI VS PBKS:- పంజాబ్ గెలిచింది. ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అభిమానులకు ఐఫీస్ట్ అందించింది. ఆఖరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది మ్యాచ్. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై బ్యాట్స్ మెన్ తీవ్ర ఒత్తిడిలోకి జారిపోయారు. ఏమాటకు ఆ మాట అంత ఒత్తిడిలోనూ అర్హ్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఒక్క బౌండరీ ఇవ్వకుండా వరుసగా రెండు వికెట్లు తీశాడు.


ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ముంబైకి 215 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఆ తరువాత ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ కూడా అంతే ధాటిగా ఆడారు. కాకపోతే.. ఇషాక్ కిషన్ ఒక్క పరుగుకే ఔట్ అవడం దెబ్బ కొట్టింది. కాని, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు. 3 సిక్సులు, 4 ఫోర్లతో 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ తరువాత క్రీజులోకి వచ్చిన కేమరాన్ గ్రీన్… బీభత్సం సృష్టించాడు. 3 సిక్సులు, 6 ఫోర్లతో 43 బాల్స్‌లో 67 పరుగులు చేశాడు.

చాలా కాలం తరువాత మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. 3 సిక్సులు, 4 ఫోర్లతో 26 బాల్స్‌లో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ హిట్టింగ్ చూసే ముంబైకి గెలుస్తామనే ఆశలు పుట్టుకొచ్చాయి. టిమ్ డేవిడ్ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. సూర్య ఔట్ అయిన తరువాత మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్న అనుమానాలొచ్చాయి. ఆ సమయంలో సిక్సులకే పనిచెప్పాడు టిమ్ డేవిడ్. 13 బాల్స్‌లో 25 పరుగులు చేశాడు. మరో ఎండ్‌ నుంచి సపోర్ట్ దొరికి ఉంటే.. టిమ్ డేవిడ్ కచ్చితంగా ముంబైని గెలిపించే వాడు.


ముంబై బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు, ఎలిస్ ఒక వికెట్, లివింగ్ స్టోన్ ఒక వికెట్ తీశారు.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు సిక్సర్లతో  విరుచుకుపడ్డారు. కెప్టెన్ శామ్ కరణ్ 29 బంతుల్లో 55 రన్స్ తో చెలరేగారు. స్థాయికి తగ్గట్టు ఆడడం లేదనే విమర్శలు మూటగట్టుకున్న సమయంలో శామ్ కరణ్ తానేంటో చూపించాడు. మరో ఎండ్‌లో ఉన్న హర్ ప్రీత్  సింగ్ భాటియా 28 బంతుల్లో 41 పరుగులు చేసి గట్టి పునాది వేశాడు. ఏడవ స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ జితేష్ శర్మ  కేవలం 7 బంతుల్లో 4 సిక్సులతో  25 పరుగులు చేసి  మోత మోగించాడు.

నిజానికి పంజాబ్ ఆరంభం అంత గొప్పగా ఏం సాగలేదు. ఓపెనర్ మాథ్యూ షార్ట్ 10 బాల్స్ ఆడి 11 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రభ్ సిమ్రన్ మాత్రమే ఓపెనర్లలో కాస్త నిలబడ్డాడు. 17 బంతులకు 26 పరుగులు చేశాడు. అథర్వ తైదే కూడా 17 బాల్స్‌లో 29 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ముంబై బౌలర్లలో  కామెరున్ గ్రీన్ 2, పీయూష్ చావ్లా 2, అర్జున్ టెండుల్కర్ 1,జోసఫ్ ఆర్చర్, జేసన్ కు తలో ఒక వికెట్ పడ్డాయి.

Related News

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Ms Dhoni: ధోని వాచ్ ల కలెక్షన్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే…ఎన్ని కోట్లు అంటే

Mumbai Indians : ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్.. అర్జున్ టెండూల్కర్ పై ముంబై ఇండియన్స్ వేటు?

Big Stories

×