BigTV English

Shirdi Sai Baba : విమర్శించకు.. విశ్లేషించుకో

Shirdi Sai Baba : విమర్శించకు.. విశ్లేషించుకో
Story Of Sai Baba
 
Story Of Sai Baba: అన్ని జీవుల్లోనూ తానే ఆత్మ స్వరూపంగా ఉంటానని ప్రకటించిన దైవం.. సద్గురు సాయినాథుడు. భక్తులు తనను ఏ ఏ రూపాల్లో పూజించిన భక్తులకు ఆయా రూపాల్లో అనేక సందర్భాల్లో బాబా దర్శనమిచ్చారు. మనిషి దైవాన్ని చేరుకోవాలని ఎంతో తపన పడతాడనీ, కానీ, ఆ దైవత్వాన్ని అనుభూతి చెందాలనుకునే వారు ముందుగా మనిషిగా అత్యున్నత స్థాయిని అందుకోవాలని, హృదయ పరివర్తనతోనే ఇది ప్రారంభమవుతుందని బాబా సూచించేవారు.
సాయిబాబా వీలున్నప్పుడల్లా చిన్న చిన్న ఉదాహరణలతో తన భక్తుల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను సరిచేస్తుండేవారు. ఒకరోజు సాయి దర్శనానికి ఒక పాత భక్తుడు వచ్చాడు. బాబాకు నమస్కరించి విభూది తీసుకుని ఓ పక్కగా కూర్చున్నాడు. ఇంతలో అతడి చూపు, అప్పటికే మసీదులో ఉన్న మరో వ్యక్తి మీద పడింది. అంతే.. ఆ భక్తుడు ఒక్కసారిగా మండిపడ్డాడు. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టటం మొదలుపెట్టాడు. అతడి తీరుకు అక్కడి కొచ్చిన భక్తులంతా బిత్తరపోయారు.

 


Also Read: చింతలు తీర్చే దైవం.. మాచర్ల చెన్నకేశవుడు..!

బాబా కూడా మిగిలిన భక్తుల మాదిరిగానే అతడి తిట్లన్నీ వింటూ ఉండిపోయాడు. అయితే, ఇంత జరుగుతున్నా ఆ తిట్లు తింటున్న వ్యక్తి మాత్రం మౌనంగా తలదించుకుని బాధతో ఉండిపోయాడు. ఇంతలో మధ్యాహ్నం కావటంతో రోజుటిలాగానే బాబా లెండీ వనానికి బయలుదేరారు. బాబా మసీదు నుంచి వెళ్లటానికి సిద్ధమవుతున్న సంగతి గమనించిన ఆ తిట్ల దండకం చదివిన భక్తుడు.. అత్యంత వినయంగా బాబా వద్దకు వచ్చి నమస్కరించాడు. తానింతసేపు ఆ వ్యక్తిని తిడుతున్నా బాబా కూడా మౌనంగా ఉండిపోవటంతో తాను చేసింది సరైన పనే అనే ధీమాతో అతడు బాబా ముందు గర్వంగా నిలబడ్డాడు.


అయితే.. బాబా అతడిని దగ్గరకు పిలిచి, దూరంగా మలాన్ని తింటున్న పందిని చూపించాడు. ‘చూడు, ఆ పంది ఆ మలాన్ని ఎంత ఇష్టంగా తింటోందో.. ఇప్పటి దాకా నువ్వూ దాని మాదిరిగానే చాలా ఇష్టంగా నీ సాటి భక్తుడిని తిట్టావు. ఈ లోకంలో మనిషిగా పుట్టాలంటే కోటి జన్మల్లో పుణ్యం చేసి ఉండాలి. మరి నువ్వు నీకు దక్కిన ఈ మానవ జన్మను ఇతరులను కష్టపెట్టటానికి వాడుతున్నావు. నువ్వు చేసింది సరైనదో కాదో నువ్వే ఇక ఆలోచించుకో’ అన్నారు. ఆ మాట వినగానే ఆ భక్తుడికి తన తప్పేమిటో తెలిసొచ్చింది. వెంటనే బాబా పాదాల మీద పడి క్షమాపణ కోరాడు.

Also Read: మార్చి 17న హోలాష్టక్ ప్రారంభం.. ఈ రాశుల వారికి చెడు రోజులు స్టార్ట్

అప్పుడు బాబా ‘ ఇతరులను తిట్టటమంటే నిన్ను నువ్వు తగలబెట్టుకోవటమే. ఈ లోకంలో మనుషులుగా జన్మించిన వారంతా తమ పూర్వ జన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. నీకు అతని ప్రవర్తన నచ్చకపోతే వదిలేసి నీ దారిన నువ్వు వెళ్లు. అంతేతప్ప అలాంటి వారిని విమర్శించటం సరికాదు. ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం. మనుషులు ఇలా పరస్పరం నిందించుకోవటం చూస్తే నాకెంతో బాధ కలుగుతుంది. ఇకపై ఇలాంటి పనికి పూనుకోవద్దు’ అని చెప్పి సాయిబాబా ముందుకు సాగిపోయారు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×