BigTV English

EV Subsidy Scheme 2024: కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఈ వాహనాల కొనుగోళ్లపై భారీ సబ్సిడీ

EV Subsidy Scheme 2024: కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఈ వాహనాల కొనుగోళ్లపై భారీ సబ్సిడీ
Electric Mobility Promotion Scheme 2024
Electric Mobility Promotion Scheme 2024

Government Launched New Scheme giving Subsidy on Electric Vehicles: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సామన్యుల నుంచి బడా బాబుల వరకు అందరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.


అయితే ప్రస్తుతం వీటి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. దాదాపు రూ.1 లక్ష పెడితే గాని మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ రావడంలేదు. అందువల్ల వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీములను తీసుకువస్తుంది. తాజాగా కేంద్రం మరో అద్భుతమైన స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విద్యుత్ వాహనాలకు సబ్సిడీ అందించేందుకు e-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(EMPS 2024)ను ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు.


Also Read: ఇండియాలో కియా కొత్త ఎస్​యూవీ..!

ఈ మేరకు ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం ఈ స్కీమ్ కింద రూ.500 కోట్ల మేర కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లో e-మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.

ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. కాగా ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అంతేకుకుండా ముఖ్యంగా గుర్తుంచుకోవాలని విషయం ఏంటంటే ఈ పథకం 4 నెలల పాటు అమల్లో ఉండనుంది. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది జులై వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త స్కీమ్ కింద.. 3.3 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌పై గరిష్టంగా రూ.10 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే 31వేల ఇ-రిక్షాల(చిన్న త్రిచక్ర వాహనాలు)పై రూ.25 వేల సబ్సిడీ అందించనున్నారు. అంతేకాకుండా పెద్ద త్రీ వీలర్స్ వాహనాలకు రూ.50 వేల మేర రాయితీ కల్పించనున్నారు.

Also Read: మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

కాగా కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సెకండ్ ఫేజ్(FAME-II) స్కీమ్ ఈ నెల అంటే మార్చి 31తో ముగియనుంది. ఇందులో భాగంగానే టూవీలర్స్ సహా ఇతర విద్యుత్ వాహనాలకు మోదీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది.

ఇది కాకుండా మరోవైపు ఐఐటీ రూర్కీతో.. భారీపరిశ్రమల మంత్రిత్వశాఖ(MHI) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ వాహనాలు సహా రవాణారంగం కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ యాక్సిలరేటర్‌ను IIT రూర్కీలో ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం MHI రూ.19.87 కోట్ల గ్రాంట్ విడుదల చేయనుంది. అందులో ఇండస్ట్రీ పార్ట్‌నర్స్ రూ.4.78 కోట్లు సమకూర్చనున్నారు.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×