BigTV English

Ranji Trophy Final Match Highlights: ఏటికి ఎదురీదుతున్న విదర్భ.. 248 / 5 విజయానికి దగ్గరలో ముంబయి

Ranji Trophy Final Match Highlights: ఏటికి ఎదురీదుతున్న విదర్భ.. 248 / 5 విజయానికి దగ్గరలో ముంబయి

mumbai vs vidarbha ranji trophy final


Mumbai vs Vidarbha Ranji Trophy Final HIGHLIGHTS: దేశ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ ఎదురీదుతోంది. ముంబై విధించిన 538 పరుగుల లక్ష్యానికి ఎదురీదుతోంది. అంతకుమించి చెప్పాలంటే గట్టి పోరాట పటిమనే చూపిస్తోంది. విదర్భ రెండో  ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఇంకా 290 పరుగులు వెనుకపడి ఉంది. ఇంక ఆట ఒక్కరోజు మిగిలి ఉంది.

ఒకవేళ ముంబయి విజయం సాధిస్తే రంజీ ట్రోఫీ చరిత్రలో 42వ సారి టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. ఒక్కరోజులో టాప్ ఆర్డర్ పడిపోయిన తర్వాత మిగిలిన 5 వికెట్లతో విదర్భ 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమనే అంటున్నారు. ఒకవేళ ఛేదిస్తే అదొక చరిత్ర అవుతుంది.


ఓవర్ నైట్ స్కోరు 10 పరుగులతో విదర్భ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు ఆథర్వ (32), ధ్రువ్ షోరె (28) చేసి ఫర్వాలేదనిపించారు. అనూహ్యంగా ఇద్దరూ 64 పరుగుల వద్దే అవుట్ అయిపోయారు. ఈ సమయంలో అమన్ (32), కరుణా నాయర్ (74) జట్టుని ఆదుకున్నారు. 15 పరుగుల వ్యత్యాసంలో మళ్లీ రెండు వికెట్లు పడిపోయాయి. అమన్ (32), యష్ రాథోడ్ (7) అవుట్ అయిపోయారు. దీంతో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ పోరాట స్ఫూర్తితో ఆడాడు.

Also Read: కొహ్లీ.. టీ 20 ప్రపంచకప్ లో ఆడటం లేదా?

ఈ సమయంలో క్రీజులో పాతుకుపోయిన నాయర్ ను సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ బోల్తా కొట్టించాడు. దీంతో కెప్టెన్ అక్షయ్ టెయిల్ ఎండర్స్ తో పోరాటాన్ని ప్రారంభించాడు. చివరికి ఆట ముగిసే సమయానికి విదర్భ 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

ముంబాయి బౌలర్లలో తనుష్ 2, ముషీర్ ఖాన్ 2, షామ్స్ ములాని 1 వికెట్టు పడగొట్టారు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×