BigTV English

Devi Temples: భారతదేశంలో ఉన్న ఆరు శక్తివంతమైన దేవి ఆలయాలు, జీవితంలో ఒక్కసారి అయినా వీటిని దర్శించుకోండి

Devi Temples: భారతదేశంలో ఉన్న ఆరు శక్తివంతమైన దేవి ఆలయాలు, జీవితంలో ఒక్కసారి అయినా వీటిని దర్శించుకోండి

Devi Temples: సాటిలేని శక్తికి దుర్గాదేవి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తున్నారు. యుగాలుగా ఆమె విశ్వాన్ని రక్షిస్తుందని నమ్ముతున్నారు. సర్వశక్తిమంతురాలైనా దుర్గాదేవిని దసరా నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. చెడును సంహరించే దేవతగా ఆ దేవిని నమ్ముతారు. అపారమైన శక్తి కలిగిన దేవి ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.


వైష్ణో దేవి ఆలయం

జమ్మూలోని వైష్ణో దేవి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 12 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. మాత వైష్ణో దేవి మహాలక్ష్మి దేవి రూపమని నమ్ముతారు. ఆమె మంచిని కాపాడేందుకు చెడును సంహరిస్తుందని, ధర్మాన్ని రక్షిస్తుందని విశ్వసిస్తారు. మంచిని కాపాడేందుకే మానవ రూపాన్ని ఎత్తిందని నమ్ముతారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ఇలా మూడు పవిత్రమైన రూపాలలో అక్కడ అమ్మవారిని కొలుస్తారు.


చాముండా దేవి ఆలయం

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ప్రసిద్ధమైన చాముండా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉగ్రరూపంలో అమ్మవారు కనిపిస్తారు. చాముండా దేవి దుష్టశక్తులను నాశనం చేస్తుందని ఇక్కడ పూజిస్తారు. ఆలయం శక్తివంతమైన ప్రదేశంగా నమ్ముతారు. చండా, ముండా అనే రాక్షసులను ఓడించి ఆ అమ్మవారు భక్తులను కాపాడిందని స్థానికుల నమ్మకం.

జ్వాలా దేవి ఆలయం

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో శ్రీ జ్వాలాముఖి ఆలయం ఉంది. అలాగే ఉత్తర ప్రదేశ్ లోని శక్తి నగర్లో ఒక జ్వాలా దేవి ఆలయం ఉంది. ఈ రెండూ కూడా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన జ్వాలా దేవి రూపాలు. జ్వాలా దేవి ఆలయంలో ఎటువంటి ఇంధనం సాయం లేకుండా రాతి పగుళ్ల నుండి మండే సహజ మంటలను కలిగిస్తుంది. ఆ కాంతి ద్వారా ప్రజలను చెడు నుంచి అమ్మవారు కాపాడుతుందని అక్కడ నమ్ముతారు.

మానసా దేవి ఆలయం

హరిద్వార్ లోని మానసా దేవి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజల కోరికలను తీర్చే మాతగా మానసా దేవి పేరు తెచ్చుకుంది. పాము కాటు నుండి రక్షణ కోసం కూడా ఈ ఆలయానికి భక్తులు వెళుతూ ఉంటారు. ఈ మానసా దేవి ఆలయం సమీపంలో ఉన్న చెట్టుకు ఒక కోరికను కోరి దారాన్ని కడతారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ దారాన్ని విప్పడానికి వస్తారు. ఆ దారాన్ని విప్పి గంగా నదిలో నిమజ్జనం చేస్తారు, లేదా ఆ పవిత్రమైన చెట్టుకిందే పాతి పెడతారు.

కల్కా దేవి ఆలయం

ఢిల్లీలోని కల్కాదేవి ఆలయం మరొక ప్రసిద్ధ దేవాలయం. ఇది మాత కాళికి అంకితం చేశారు. ఢిల్లీలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మూడు వేల సంవత్సరాలకు క్రితం దీనిని కట్టారని నమ్ముతారు. ప్రపంచంలోని నన్ను మూలాల నుండి ఈ ఆలయాన్ని చూసేందుకు వస్తారు.

Also Read: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ.. విశిష్టత తెలుసా ?

ధారీ దేవి ఆలయం

ధారీ దేవి ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది. అత్యంత పవిత్రమైన గౌరవప్రదమైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. కాళికా మాతను అక్కడ ధారీ దేవి అని పిలుచుకుంటారు. శక్తికి ఉగ్రరూపంగా ఇక్కడ ధారీ దేవిని చెబుతారు. ఆలయంలోని కాళీమాత విగ్రహం నల్లని రాతతో రాతితో చెక్కబడి ఉంటుంది.

పైన చెప్పిన ఆలయాలను ఒక్కసారైనా దర్శించుకోండి. మీకు మానసిక ప్రశాంతత దక్కుతుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×