E-Paper
Advertisement

OTT Movie : భర్తకు ఆ పాడు అలవాటు… పెళ్లి తర్వాత ప్రియమణి చేసిన బో*ల్డ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : భర్తకు ఆ పాడు అలవాటు… పెళ్లి తర్వాత ప్రియమణి చేసిన బో*ల్డ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

OTT Movie : సౌత్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ప్రియమణి పెళ్లి తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమాలేంటి వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఇదివరకంటే ఇప్పుడే ఎక్కువ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తున్న ట్రెండ్ ను ఫాలో అవుతున్న హీరోయిన్లలాగే ఈ బ్యూటీ కూడా ఒక బో*ల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో నటించింది. మరి పెళ్లి తరువాత ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుని ప్రియమణి నటించిన ఆ వెబ్ సిరీస్ ఏంటి? అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ లో ప్రియమణి ఒక సక్సెస్ ఫుల్ చెఫ్. ప్రియమణి చెఫ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మూవీ ‘భామాకలాపం’. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు సీజన్లు రిలీజ్ కాగా, అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా మాత్రం ఇది కాదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. హీరోయిన్ సూపర్ చెఫ్ గా ఒక రెస్టారెంట్ ని నడుపుతుంది. బిజినెస్ సక్సెస్ ఫుల్ కావడంతో పార్టీని నిర్వహిస్తారు. ఇక అందులో తనదొక పర్ఫెక్ట్ లైఫ్ అంటూ దానికి క్రెడిట్ ను భర్తకే ఇస్తుంది ఈ దంపతులకు ఇద్దరు టీనేజ్ పిల్లలు ఉంటారు. ఆ తర్వాత ఓ రోజు ఎప్పటిలాగే హీరోని కలవడానికి హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తుంది. కానీ ఆఫీసులో హీరో లేడు ముందుగానే వెళ్లిపోయాడు అంటూ వాచ్మెన్ చెప్తాడు. దీంతో ఎక్కడికెళ్లాడో అర్థం కాక హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే భర్తను మరో వ్యక్తితో ఊహించని పరిస్థితిలో చూస్తుంది. అప్పటిదాకా తన భర్త గురించి తనకే తెలియని ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది హీరోయిన్ కి. ఇక ఆ తర్వాత వీళ్ళ జీవితంలో అన్ని సమస్యలే ఎదురవుతాయి.

ఓ పార్టీకి వెళ్లిన ఈ ఫ్యామిలీలోని పెద్ద కొడుకు అక్కడ గే అబ్బాయిని చూసి అసహ్యించుకుంటాడు. ఆ తర్వాత కారులో ఇంటికి వెళ్తుండగా ఇద్దరు పిల్లల మధ్య దాని గురించిన డిస్కషన్ నడుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త గురించి ఫ్రెండ్ కి నిజాన్ని చెప్తుంది. అంతేకాకుండా అతను ఒక తేడాగాడు అని చెప్పడం కంటే తానే దిగజారానని చెప్పడం ఈజీ అంటూ చిరాకు పడుతుంది. అసలు భర్త గురించి హీరోయిన్ కు తెలిసిన నిజమేంటి? హీరోయిన్ అతని గురించిన ప్రస్తావన వస్తే ఎందుకు ఇంత ఫ్రస్టేట్ అవుతోంది? ఇక ఆ నిజం ఇంట్లో తెలుసాక ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘హిజ్ స్టోరీ‘ అనే ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. ఈ సిరీస్ మొత్తం 11 ఈ ఎపిసోడ్లుగా సాగగా, ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుంది. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా ఈ సిరీస్ ని ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్ వెయ్యండి.

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×