Somvati Amavasya 2025: హిందూ ధర్మశాస్త్రాలలో ‘సోమవతి అమావాస్యం’కు ప్రత్యేకమైన స్థానం కలిగివుంది. సోమవారం రోజు అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్యం అంటారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అలా వస్తుంది. అందుకే ఆ రోజుకు అంత ప్రాముఖ్యత. 2025లో మే 26న సోమవారం మధ్యాహ్నం అమావాస్య ఎంటర్ కానుంది.
ఈ విధంగా రావడం ఇదే తొలిసారని పండితులు చెబుతున్నారు. సోమావతి అమావాస్య రోజు పితృ దేవతల పూజలు, ఉపవాసం, పుణ్యకార్యాలు, తీర్థస్నానాలు చేయడం ఎంతో శ్రేయస్కరంగా చెబుతారు. పురాణాలలో ఈ రోజుకు సంబంధించిన పలు ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. మహాభారతం, స్కాంద పురాణం, పాద్మ పురాణం వాటిలో ప్రాధాన్యతను వివరించాయి కూడా.
మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యం సోమవారం రావడంతో సోమవతి అమావాస్య అని మరికొందరు చెబుతారు. ఆ రోజు పవిత్రమైన నదీ స్నానం చేసి పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శివరాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెబుతారు.
దీని గురించి పురాణాల్లోకి వెళ్తే.. దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తన కూతురు సతీదేవి-అల్లుడు శివుడ్ని ఆహ్వానించకుండా అవమానిస్తాడు. దీనికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, దేవతలు, మునులు వెళ్తారు. పిలవని పేరంటానికి వెళ్లకూడదని శివుడు చెప్పినా యజ్ఞానికి సతీదేవి వెళ్తుంది. అక్కడ జరిగిన అవమానానికి గురై ఆమె, తన శరీరాన్ని త్యాగం చేస్తుంది.
ALSO READ: ఆ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది
సతీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే శివుడు ఆగ్రహంతో రగిలిపోతాడు. శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని రప్పిస్తాడు. దక్ష యజ్ఞాన్ని వారందరిని చితక బాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్న శివ గణాల చేతిలో చంద్రుడు చావు దెబ్బలు తింటాడు. ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో పరమ శివుడ్ని వేడుకుంటాడు చంద్రుడు.
చంద్రుని అవస్థను చూసిన భోళాశంకరుడు సోమవారం వచ్చే అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ 109 సార్లు ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోమవారం అమావాస్య ను సోమావతి అమావాస్యగా జరుపుకుంటారు భక్తులు.
సోమవతి అమావాస్య రోజున తలకు స్నానం చేయాలి. రావిచెట్టుకు, శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మాణులకు దానంగా ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు, పేదరికం తొలగిపోతుందని చెబుతున్నాయి. ఈ సమయంలో శివుడ్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి. ఆ విధంగా దేవతలు, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితుల మాట. అమావాస్య రోజు చిన్న చిన్న చెట్లను నాటడంవల్ల అదృష్టం పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం మరింత మంచిదిగా చెబుతున్నారు. ఆ రోజు వీటికి దూరంగా ఉండాలి. జుట్టు, గోర్లు కత్తిరించకూడదని చెబుతున్నాయి. ముఖ్యంగా మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకు కూరలు తినకూడదు. ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. అలాగే గొడవలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.