BigTV English

Simbu : అందుకే నాన్నను రావద్దు అని చెప్పాను, స్టేజ్ పై ఏడ్చేసిన శింబు

Simbu : అందుకే నాన్నను రావద్దు అని చెప్పాను, స్టేజ్ పై ఏడ్చేసిన శింబు

Simbu : తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమాను భాషతో సంబంధం లేకుండా ప్రేమించడం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే చెల్లింది. ముఖ్యంగా తెలుగు సినిమాల కంటే కూడా ఇతర సినిమాలకు కూడా ఎక్కువ ఆదరణ చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే హరీష్ శంకర్ వంటి దర్శకులు కూడా “మనకు పొరిగింటి పుల్లకూర రుచి అంటూ” మన సినిమాల కంటే కూడా వేరే లాంగ్వేజ్ సినిమాలోనే ఎక్కువ చూస్తారు అని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇకపోతే చాలామంది తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. సూర్య, విక్రమ్, కమలహాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలను విపరీతంగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలానే శింబు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.


ఎన్నో బ్లాక్బస్టర్స్ 

శింబు నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా వల్లభ, మన్మధ వంటి సినిమాలను ఎవరూ మర్చిపోలేరు. అయితే శింబు నటించే సినిమాలు సంచలనాత్మకంగా అనిపించేవి. కేవలం నటుడుగానే కాకుండా చాలామంది తెలుగు హీరోలకు శింబు పాటలు కూడా పాడారు. తెలుగు హీరో మంచు మనోజ్ తో శింబుకి మంచి అనుబంధం ఉంది. మనోజ్ చెన్నై వెళ్లిన ప్రతిసారి శింబు ఇంట్లోనే ఉంటారు. శింబు కు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి తాను సినిమాల్లోనే పెరిగాడు. ఈ విషయంపై శింబు థగ్ లైఫ్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ స్పందించాడు.


స్టేజ్ పై ఏడ్చేశాడు

శింబు మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు పిల్లలందరూ ఆడుకుంటూ సరదాగా గడిపే సమయంలో, ప్రతిరోజూ షూట్‌లకు వెళ్లి చదువుకోవడం నాకు కష్టమయ్యేది, కానీ ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత, సినిమా గురించి అన్నీ తెలిసినందుకు శింబును అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదంతా నాన్న, అమ్మ వల్లే జరిగిందని విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు భావోద్వేగానికి గురవుతారు కాబట్టి ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పాను, కానీ ఇప్పుడు నేను భావోద్వేగానికి గురవుతున్నాను. అంటూ స్టేజ్ పైన ఏడ్చేసాడు. ఇకపోతే శింబు కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ కూడా శింబును చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సోషల్ మీడియాలో తన వీడియో షేర్ చేస్తూ భారీ ఎలివేషన్ ఇస్తుంటారు. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శింబు ఈ సినిమాతో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు.

Also Read : Tripti Dimri : నిర్మాతలకు దిమ్మతిరిగే షాకిచ్చిన యానిమల్ బ్యూటీ.. ఇలా అయితే కష్టమే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×