Big Stories

Sri Rama Navami Brahmotsavam : భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుండంటే..

bhadrachalam brahmotsavam 2024
bhadrachalam brahmotsavam 2024 

Sri Rama Navami Brahmotsavam 2024 : ప్రతి ఏటా ఛైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా దేవస్థానంలో రామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది ఆలయ కమిటీ. ఈ మేరకు ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల తేదీలను వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 23 వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణం జరగనుంది. ఏప్రిల్ 18న రాములోరి పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది.

- Advertisement -

Read More : శని తిరోగమనం .. ఈ రాశుల వారికి శుభ సమయం..

- Advertisement -

ఏప్రిల్ 13 – మండల లేఖన, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులు, సార్వభౌమ వాహన సేవ ఉంటాయి.

ఏప్రిల్ 14 – గరుడ ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడాధివాసం, 15న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీతాడనం, దేవతాహ్వానం, బలిసమర్పణ, హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

ఏప్రిల్ 16 – యాగశాల పూజ, చతుఃస్థానార్చన, ఎదుర్కోలు.

ఏప్రిల్ 17 – శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం.

ఏప్రిల్ 18 – మహాపట్టాభిషేకం.

ఏప్రిల్ 19 – మహదాశీర్వచనం.

ఏప్రిల్ 20 – తెప్పోత్సవం, డోలోత్సవం.

ఏప్రిల్ 21 – ఊంజల్ సేవ.

ఏప్రిల్ 22 – వసంతోత్సవం.

ఏప్రిల్ 23 – చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, శ్రీ పుష్పయాగం అనంతరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకూ నిత్య కల్యాణాలు, దర్బారు సేవల్ని రద్దు చేస్తున్నట్లు వైదిక కమిటీ వెల్లడించింది. మే 1 వరకూ పవళింపు సేవలు జరగవని స్పష్టం చేసింది.

కాగా.. గత బీఆర్ఎస్ హయాంలో రాములోరి కల్యాణం సరిగ్గా నిర్వహించేదే లేదు. ముత్యాల తలంబ్రాలు కాదు కదా.. కనీసం పట్టు వస్త్రాలైనా పంపలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈసారి ప్రభుత్వం మారడంతో.. రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాములవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News