BigTV English

Deepika Padukone: నేను తల్లిని కాబోతున్నానోచ్.. ఏ మంతో చెప్పేసిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

Deepika Padukone: నేను తల్లిని కాబోతున్నానోచ్.. ఏ మంతో చెప్పేసిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

Deepika padukone news today


Deepika padukone news today(Bollywood celebrity news): బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో నటి దీపికా పదుకొనే ఒకరు. ఎన్నోఏళ్ల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ పలు చిత్రాలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూ ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకుంది.

గతేడాది షారుఖ్ ఖాన్‌తో పఠాన్ మూవీలో హీరోయిన్‌గా నటించిన అందరి మన్ననలు పొందింది. ఆ తర్వాత షారుఖ్, నయనతార నటించిన జవాన్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ పాత్ర చిన్నదే అయినా.. అందులో కూడా దీపికా తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది.


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి2898 ఏడీ’ మూవీలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే దీపికా, రణ్‌వీర్‌లు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ‘గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా’ సెట్స్‌లో కలుసుకున్నారు. ఇక అక్కడ నుంచి పలు సినిమాలు చేసి చివరి ఆరేళ్లపాటు ప్రేమాయణం చేసి 2018లో పెళ్లి చేసుకున్నారు.

READ MORE: దీపికా పదుకొనే ఏడాది సంపాదన అన్ని కోట్లా..?

అయితే ఇన్నేళ్లకు దీపికా తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె గర్భం దాల్చినట్లుగా గత రెండు నెలల నుంచి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల దీపికా బాఫ్టా అవార్డుల వేడుకకు హాజరైంది. అక్కడ దీపికా బేబీ బంప్‌ను నెటిజన్లు గుర్తించారు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్తలు జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో నెటిజన్ల నటి దీపికా పదుకొనే తమ అభిమానులకు సర్ప్రైజ్ అందించింది. ఆమె గర్భవతి అన్న వార్తలను నిజం చేస్తూ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ఈ మేరకు తన డెలివరీ తేదీని దీపిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలియజేసింది.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ మూవీకి దీపికా రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. రూ. 20 కోట్లా..?

తన గర్భాన్ని ప్రకటిస్తూనే, 2024 సెప్టెంబర్‌లో బిడ్డ పుడుతుందని రాసుకొచ్చింది. దీంతో దీపిక పెట్టిన ఈ పోస్ట్‌కి కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వీక్షణలు, కామెంట్‌లు వచ్చాయి. సెలబ్రిటీలు, అభిమానులు వీరికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×