E-Paper
Advertisement

Tantra Temples : తంత్ర పూజలకు ఆ గుడి ఫేమస్?

Tantra Temples : తంత్ర పూజలకు ఆ గుడి ఫేమస్?
Advertisement

Tantra Temples

Tantra Temples : పురాణాల ప్ర‌కారం సతీదేవిని విష్ణువు త‌న సుద‌ర్శ‌నంతో 51 ముక్కలుగా న‌రికిన‌ప్పుడు ఆ భాగాలు ప‌డిన ప్రాంతాలు శ‌క్తి పీఠాలుగా ఉద్భ‌వించాయి.ఈ ప్రదేశాలను పవిత్ర పుణ్యక్షేత్రాలు అంటారు.అందులో కామాఖ్య దేవాలయం కూడా ఒక‌టి.ఇది అసోంలోని నీలాంచల్ కొండ ప్రాంతంలో ఉంది. కామాఖ్య దేవాలయం ఆకారం ఒక కొలనులా కనిపిస్తుంది

Advertisement

పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి అయిన ప్రజాపతి దక్షుడు.త‌న అల్లుడైన‌ శివుడిని ఆహ్వానించకుండా ఒక గొప్ప యజ్ఞం నిర్వ‌హించాడు.ఈ కార్య‌క్ర‌మానికి స‌తీదేవి వెళ్ల‌గా ద‌క్షుడు శివుని గురించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడతాడు.దీంతో కోపానికి గురైన సతీదేవి హోమ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది.ఈ విషయం శివునికి తెలియడంతో ఆయ‌న‌ మహాయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తన భార్య మృత దేహంతో తాండ‌వం చేయ‌డం మొదలుపెట్టాడు.ఆ తరువాత విష్ణువు… శివుని కోపాన్ని చల్లార్చడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడు.

సతీ మాత శరీర భాగాలు ప‌డిన ప్రాంతాల‌ను శక్తిపీఠాలుగా పిలుస్తారు.ఈ శ‌క్తి పీఠాల‌లో ఒక‌టే కామాఖ్య ఆల‌యం. కామాఖ్య దేవాలయం ఆకారం ఒక కొలనులా కనిపిస్తుంది, దాని చుట్టూ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది.పౌరాణిక క‌థ‌నాల‌పై ఉన్న న‌మ్మ‌కాల‌ ప్రకారం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర నిర్వహిస్తారు, ఆ సమయంలో తల్లి కామాఖ్య స్వయంగా రుతుక్రమంలో ఉంటుంది.ఈ కార‌ణంగా దేవాలయంలో ఎర్ర‌ని నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 22 నుండి జూన్ 26 వరకు జరుపుకుంటారు.

Advertisement

కామాఖ్య దేవాలయం లో పది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేశారు. అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో తంత్ర-మంత్ర పూజలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ త్రిపురసుందరి, మాతంగి, కమల ఇతర దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×