జ్యోతిష శాస్త్రంలో సూర్యుని గ్రహాల రాజుగా చెప్పుకుంటారు. సూర్యుడు.. తండ్రిని, ధైర్యాన్ని, ఆత్మను సూచిస్తాడు. అంటే రాశి చక్రంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ప్రతినెలా తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. 12 రాశి చక్రాల్లోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి మారుతూ అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశులకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఆగస్టు 17న సూర్యుడు ఏడాది తర్వాత తన సొంత రాశి అయినా సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు. వారికి వృత్తిలో వృద్ధి కనపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి.
సింహ రాశి
సూర్యుడి సొంత రాశి సింహ రాశి.. కాబట్టి సింహ రాశి వారికి సూర్యుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో గతంతో పోలిస్తే మరింత విజయాలు అందుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వారి మద్దతు లభిస్తుంది. ఇక వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి
సూర్యుని రాశి సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఎన్నో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వారి వ్యక్తిత్వం కూడా మంచిగా మారుతుంది. అప్పుగా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మాత్రం సూర్యుని సంచారం ఎంతో మేలు చేస్తుంది. వీరు ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటారు.
ధనుస్సు
ధనస్సు రాశి వారికి సూర్యుని సింహరాశి ప్రయాణం వల్ల అదృష్టం కలుగుతుంది. కొన్ని పనులు అనుకోకుండానే పూర్తి అవుతాయి. చేస్తున్న పనులు జోరుగా సాగుతాయి. వ్యాపారం ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి.