HHVM Flex Torned Video: హరి హర వీరమల్లు అక్కడ ఊహించని షాక్ తగిలింది. ఆగ్రహంతో కొందరు ఈ మూవీ ఫ్లెక్సీని చింపేసిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. అసలేం జరిగింది, భారీ హైప్ ఉన్న హరి హర వీరమల్లు ఫ్లెక్సీ చింపేయడానికి కారణమేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఉన్న బజ్ అంతా ఇంత కాదు. డిప్యూటీ సీఎంగా పవన్ గెలిచిన అనంతరం ఆయన నుంచి వస్తున్న తొలి చిత్రమిది. అలాగే ఆయన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.
16వ శతాబ్ధం నాటి పోరాట యోధుడు
భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో మొదలైంది. ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో ఏఎం జ్యోతి క్రష్ణ మూవీని పూర్తి చేశాడు. ఇందులో పవన్ 16వ శతాబ్ధం కాలం నాటి పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. జౌరంగ జేబు ఆరాచకాలను వీరమల్లు ఎలా అరికట్టాడనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. బుధవారం జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ విడదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఆయా రాష్ట్రాల్లో మూవీ రిలీజ్ ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి.
కర్ణాటకలో వీరమల్లుకు షాక్
ఈ క్రమంలో కర్ణాటకలో పవన్ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు. ఆయా థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కడుతూ పండగ చేసుకుంటారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని స్థానికులు థియేటర్ ముందున్న హరి హర వీరమల్లు ఫ్లెక్సీని చింపేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి కారణం.. ఫ్లెక్సీ కన్నడ లేకపోవడమే నట. ఇతర భాషలో ఉన్న మూవీ ఫ్లెక్సీని చూసి స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. తమ రాష్ట్రంలో స్థానిక భాష లేకుండ ఇతర భాషలో ఫ్లెక్సీ ఉండటమేంటని వ్యతిరేకిస్తూ.. దానికి చింపేసి రోడ్డుపై పడేసి నానా రచ్చ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rana Daggubati: విచారణకు డుమ్మా.. హీరో రానాకు మరోసారి ఈడీ నోటీసులు
ఒక్కసారిగా పెరిగిన బజ్..
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హరి హర వీరమల్లుకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇవాళ రాత్రికి ప్రీమియర్స్, రేపు మూవీ విడుదల కానుంది. మూవీ థియేటర్లలోకి వచ్చేందుకు ఇంక కొన్ని గంటలే ఉండటంతో బుకింగ్స్ ఒపెన్ కాగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో టికెట్లని సోల్డ్ అవుట్ అయ్యాయి. మొన్నటి వరకు సినిమాకు ఈ రేంజ్ లో బజ్ లేదు. సోమవారం సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి పవన్.. మూవీ భారీ బజ్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ మొత్తం తన భుజన వేసుకుని వరుస ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్ లో పెడుతున్నారు. యూట్యూబర్లతో సైతం ఆయన ఇంటారాక్ట్ అవ్వడం చూసి సినిమా, నిర్మాతల పట్ల ఆయన నిబద్ధతకు ఆదర్శనీయం అంటున్నారు.
కర్ణాటకలో హరి హర వీరమల్లు ఆడబోతున్న థియేటర్ దగ్గర అభిమానులు ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ కన్నడలో లేకపోవడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ఫ్లెక్సీని చింపేశారు. #HHVM #Pawankalyan #HHVMonJuly24th #HariHaraVeeraMallu #Kannada #KannadaNews #Flex @PawanKalyan @AMRatnamOfl… pic.twitter.com/I3lrLCGzEp
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2025