Saturn Lucky Numbers: శని దేవుడు కఠినంగా ఉన్నప్పటికీ.. ఆయన ఎవరిపై ఆశీస్సులు కురిపిస్తారో.. వారికి అపారమైన విజయాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. శని దేవుడికి ప్రియమైన తేదీల్లో పుట్టిన వ్యక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. మరి ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనిని కర్మ దాతగా పిలుస్తారు. ఆయన న్యాయ దేవుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. శని ఆశీర్వాదం పొందినవారు రాజు అవుతాడని అంటారు. ఇదిలా ఉంటే.. శని కోపానికి గురయ్యే వ్యక్తి పూర్తిగా పేదవాడవుతాడని చెబుతారు. అంతే కాకుండా డబ్బును కూడా నష్టపోతారట. అంతే కాకుండా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శని కఠినంగా ఉన్నప్పటికీ.. ఆయన ఎవరిపైనా తన ఆశీస్సులు కురిపిస్తారో.. వారికి ఆయన అపారమైన విజయాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. శని దేవుడికి ప్రియమైన సంఖ్యలు ఏవి ? ఆ తేదీల్లో జన్మించిన వారిపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. 8వ తేదీలో పుట్టిన వారు:
8వ సంఖ్యకు సంబంధించిన తేదీలు ఉన్న వ్యక్తులు కూడా శని దేవునికి ఇష్టమైన వారి జాబితాలో ఉంటారని చెబుతారు. మీరు ఏదైనా నెలలో 8, 17 లేదా 26వ తేదీలలో జన్మించినట్లయితే.. శని మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాడని అర్థం చేసుకోండి. ఈ సంఖ్యలు శని గ్రహానికి సంబంధించినవి.. కాబట్టి ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు కష్టపడి పనిచేసేవారిగా ఉంటారు. అంతే కాకుండా వీరి జీవితంలో ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చినప్పటికీ.. విజయం సాధించినప్పుడు వారు పేదరికం పూర్తిగా తొలగిపోయి రాజు అవుతారు.
2. శనివారం జన్మించిన వ్యక్తులు:
శని రోజు శనివారంగా చెబుతారు. మీరు కూడా శనివారం జన్మించినట్లయితే.. శనిదేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది. శనివారం జన్మించిన వ్యక్తులు గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉంటారని , కష్ట పడి పనిచేయడంలో కూడా నిష్ణాతులు అని చెబుతారు. మీ జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే.. మిమ్మల్ని గొప్ప అవకాశాలు, అపారమైన విజయాన్ని పొందకుండా ఎవరూ ఆపలేరు.
3. మకరం, కుంభ రాశి వ్యక్తులు:
శనికి ఇష్టమైన రాశులు మకరం, కుంభం అని చెబుతారు. ఎందుకంటే ఈ రెండు రాశులు శని దేవుని పాలనలోకి వస్తాయి. ఈ రాశుల వ్యక్తులు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. అంతే కాకుండా స్వావలంబన కలిగి ఉంటారు. జీవితంలో కష్టపడాల్సి రావచ్చు, కానీ విజయం సాధించినప్పుడు మాత్రం అపారమైన ఎత్తుకు చేరుకుంటారు.
Also Read: ఏప్రిల్‌లో.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారం
4. సాడే సాతి, ధైయ్యా సమయంలో శుభకార్యాలు చేసే వ్యక్తులు:
ప్రస్తుతం శని సాడే సాతి రెండవ దశ మీన రాశిలో జరుగుతుంది. శని సాడే సతి లేదా ధైయా ప్రభావం ఉన్న వ్యక్తులు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ సమయంలో కూడా ప్రజలు నిజాయితీ, కృషి ,సేవా స్ఫూర్తిని అలవర్చుకుంటే,. శని వారికి సమృద్ధిగా ఫలాలను ఇస్తాడు. ఐశ్వర్యాన్ని అందిస్తాడు