Lucky zodiac signs: మార్చి 29, 2025న ఈ ఏడాది అతిపెద్ద రాశి మార్పు జరిగింది. ఈ రోజు శని కుంభ రాశి నుండి తన ప్రయాణాన్ని ముగించి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇదే కాకుండా.. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా మార్చి 29న రోజున జరిగింది. దీని తరువాత.. శని ఏప్రిల్‌లో తన రాశి మారనున్నాడు.
రాశి మార్పు తర్వాత.. శని 28 ఏప్రిల్ 2025న ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తాడు. అదే రోజున గురువు కూడా మృగశిర రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు ప్రధాన గ్రహాలు రాశి మారనున్నాయి. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. ఒకే రోజున శని, బృహస్పతి నక్షత్రరాశిలో మార్పు 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. అయితే.. ఈ యాదృచ్చికం కారణంగా కొంతమందికి వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగంలో పదోన్నతితో పాటు అనేక ఇతర శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శని, గురువు నక్షత్రరాశిలో మార్పు మేష రాశి వారికి అధిక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండు గ్రహాల ప్రభావం కారణంగా.. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి మార్గాలను కనుగొంటారు. కోర్టులో భూమికి సంబంధించిన ఏదైనా కేసు నడుస్తుంటే.. అది శని ప్రభావం వల్ల పరిష్కరించబడుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు అవసరంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులు పరిష్కరించబడతాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండటానికి అనేక అవకాశాలు కూడా ఉంటాయి.
కర్కాటక రాశి:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఏప్రిల్‌లో శని, బృహస్పతి నక్షత్రాల మార్పు కారణంగా.. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. మీ అభిరుచులు, సరదా విషయాలలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. మీకు ఇష్టమైన కొన్ని వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం.. ఉగాది తర్వాత ఏం జరగబోతుందంటే ?
ధనస్సు రాశి:
మీరు ఇల్లు లేదా వాహనం కొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. శని ,బృహస్పతి ప్రభావం వల్ల పెట్టుబడిలో లాభం కారణం మీ కోరికలు నెరవేరతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. లాభాలకు అవకాశాలు ఉంటాయి. మీరు వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. అంతే కాకుడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మీ పెట్టుబడులు మీకు లాభాలను అందిస్తాయి. వైవాహక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు చేపట్టే కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు.