Malaika Arora:మలైకా అరోరా (Malaika Arora).. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ పేరు చెప్పగానే ముందుగా స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి.. ఆ తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbhaj khan) ను వివాహం చేసుకున్న ఈమె 19 సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వయసులో తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ (Arjun Kapoor) తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు నాలుగేళ్ల పాటు అతనితో కలిసి చట్టపట్టలేసుకొని తిరిగింది. అటు టూర్లకి కూడా వెళ్లి ఆ ఫోటోలను షేర్ చేసి, పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో సడన్గా బ్రేకప్ అయిపోయారు. ఇక ప్రస్తుతం మలైకా ఒంటరిగానే జీవిస్తోంది. అలాంటి ఈమెపై ఇప్పుడు మరొకసారి ప్రేమలో పడిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తోంది.
మాజీ క్రికెటర్ తో మలైకా డేటింగ్..
అసలు విషయంలోకి వెళ్తే.. గౌహతిలో చెన్నై – రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దీనికి హాజరైన మలైకా లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (Kumara Sangakkara)పక్కనే కూర్చుని అందరికీ కనిపించింది. దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ అటు బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ వార్తలు వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు మలైకా సన్నిహితులు మాత్రం అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రాన డేటింగ్ అని ఎలా అంటారు అంటూ డేటింగ్ కామెంట్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికైతే మళ్లీ డేటింగ్ వార్తలంటూ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ డేటింగ్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మలైకా అరోరా కెరియర్..
ఇక మలైకా అరోరా విషయానికి వస్తే.. మోడల్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా, డాన్సర్ గా, హోస్ట్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుందిఅంతేకాదు హిందీ సినిమాల్లో ఎక్కువగా పనిచేసిన ఈమె 2008లో.. అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత తన భర్తతో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి, దీని ద్వారా పలు చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఈమె మహారాష్ట్ర థానేకు చెందినవారు. ఈమె సోదరి ఎవరో కాదు అమృత అరోరా. ఇక ఈమె బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే 1973 అక్టోబర్ 23న జన్మించింది. ఈమెకు 11 సంవత్సరాల వయసు ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు .తర్వాత తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి చెంబూరుకు వెళ్లిపోయారు. ఈమె తల్లి జాయిస్ పాలికాప్ మలయాళీ కేథలిక్ కాగా తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త. ఈయన నేవీలో కూడా పనిచేశారు. ఇక ఇండస్ట్రీలోకి రావాలనుకున్న మలైకా అరోరా మొదట మోడలింగ్ రంగంలో ప్రావీణ్యం పొందిన తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ డేటింగ్ రూమర్స్ రావడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.