E-Paper
Advertisement

Tirumala: నాసా శాస్త్రవేతలనే భయపెట్టిన తిరుమల రహస్యం – యుగాంతం అప్పుడేనా..?

Tirumala: నాసా శాస్త్రవేతలనే భయపెట్టిన తిరుమల రహస్యం – యుగాంతం అప్పుడేనా..?

Tirumala: నాసా శాస్త్రవేత్తలనే భయపెట్టిన తిరుమల రహస్యం. అక్కడ దొరికిన ఆనవాళ్ల వ్రకారం కలియుగం ఎప్పుడు అంతం అవుతుదో నాసా శాస్త్రవేత్తలకు తెలిసిపోయిందా…? కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి కొండల్లో నాసా శాస్త్రవేత్తలకు దొరికిన ఆనవాలు ఏంటి…? ఎలా పరీక్షించి సైంటిస్టులు నిర్దారణకు వచ్చారు.. లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

అద్బుతాలకు నెలవు తిరుమల ఏడు కొండలు:

తిరుమల ఏడు కొండలు వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొండ మీద అంతుచిక్కని అద్బుతాలు ఎన్నో ఇప్పటికీ భక్తులకు అనుభూతిలోకి వస్తూనే ఉన్నాయి. స్వామివారి సాక్ష్యాత్కారం నుంచి ప్రకృతిలో జరిగే వింతలు విశేషాల వరకు ఒక్కటేమిటి తిరుమల కొండల్లో వేల అద్బుతాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇదంతా ఒక ఎత్తైతే సైంటిఫిక్‌ గా నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నది కూడా అతి భయాన్ని కల్పిస్తున్నదని. వారి మాటల ప్రకారం కలియుగం అంతం అయ్యేనాటికి తిరుమల కొండల మీద ఒక అద్బుతం జరగనుందట.

నాసా శాస్త్రవేత్తలను భయపెట్టిన జోస్యం:

నాసా శాస్త్రవేత్తలను కూడా భయపెట్టిన ఆ జోస్యం ఏంటి..? భవిష్యపురాణం ప్రకారం కలియుగం ఉధృతంగా ఉన్నప్పుడు తిరుమల కొండల నుంచి ఒక వింత కాంతి వస్తుందట. అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం తన రూపాన్ని మార్చుకుంటుందట. ఇదే విషయాలు 2018లో వచ్చిన నాసా రహస్య నివేదికలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ రిపోర్ట్  ప్రకారం. తిరుమల పర్వతం కింద ఒక అజ్ఞాత శక్తి వనరు ఉందట. అది ప్రతి ఏటా 0.3 శాతం చొప్పున పెరుగుతుందట. ఇదే కనక కొనసాగితే 2035 నాటికి ఆ అజ్ఞాత శక్తి కేంద్రం నుంచి ఒక భారీ అయస్కాంత తుఫాను వచ్చే ప్రమాదం ఉందని.. శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

2020లో ప్రాజెక్టు గరుడ:

ఇదే అంశం మీద మళ్లీ నాసా శాస్త్రవేత్తలు 2020లో ప్రాజెక్టు గరుడ పేరుతో అక్కడే పరిశోధనలు చేశారట. ఆ పరిశోధన పత్రాల నుంచి లీకైన పత్రాల ప్రకారం ఇక్కడ రాళ్లల్లో దొరికిన లోహాన్ని పరిశీలిస్తే.. ఆ లోహం  అంతరిక్షంలో తిరిగే ఉల్కల్లో ఉండే లోహంతో సరిపోతుందట. ఆ విషయం తెలిసి నాసా శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారట.

భూకంప మాపక యంత్రం నుంచి ఓం శబ్దం:

అయితే ఇక్కడే నాసా శాస్త్రవేత్తలు ఉంచిన భూకంప మాపక యంత్రాలు ఇక్కడ రోజుకు మూడు సార్లు ఒక వింత శబ్దాన్ని రికార్డు చేశాయట. అవి రికార్డు చేసిన ఆ శబ్ధం అచ్చం ఓం అనే పదంలా వినిపిస్తుందట.  పర్వతం కింద ఉన్న భారీ గుహలో ఏదో ఒక సజీవ శక్తి స్పందిస్తుందని శాస్త్రవేత్తలు నమ్మారట. ఇదంతా కలియుగం అంతానికి సంకేతమా..? లేదా ఏదైనా ప్రళయానికి సూచికనా అనేది శాస్త్రవేత్తలు తేల్చలేకపోతున్నారట. ఏది ఏమైనా కూడా ఆ వెంకటేవ్వర స్వామి లీలలు మాత్రం నిజంగా అద్బుతం అనే చెప్పాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 ALSO READ: నరసింహ్మస్వామితో పరమశివుడు ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా..?- ఆ యుద్ధంలో ఎవరు గెలిచారంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×