E-Paper
Advertisement

camphor: దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారో తెలుసా..?

camphor: దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారో తెలుసా..?

camphor: దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారో తెలుసా..? హారతి ఇవ్వడం వెనక ఉన్న సైన్స్‌ మరియు ఆధ్యాత్మిక విషయాలు ఏంటో తెలుసా..? హారతి ఇవ్వడానికి కర్పూరాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..? కర్పూర హారతి వెనక దాగున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ దేవాలయాలలో నిత్య పూజలు జరుగుతుంటాయి. ప్రతి పూజ పూర్తిన తర్వాత దేవుడికి కచ్చితంగా కర్పూర హారతి ఇస్తుంటారు. అయితే దేవుడికి దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారన్న విషయంలో చాలా సైంటిఫిక్‌ విషయాలే కాకుండా ఆధ్యాత్మిక పరిజ్ఞానం దాగి ఉందంటున్నారు పండితులు. మనము దేవాలయానికి వెళ్లినప్పుడు చివరగా ఇచ్చే కర్పూర హారతి (Aarti) చాలా ప్రత్యేకమైనది. చాలామందికి ఇది కేవలం ఆచారం లేదా సంప్రదాయం అనిపిస్తుంది.

కర్పూరం పూర్తిగా కాలిపోవడం వెనక అంతర్యం:

కర్పూరం ఒక ప్రత్యేక పదార్థం. దీన్ని వెలిగిస్తే అది కొవ్వొత్తి లేదా నూనె దీపంలా మిగులు బూడిదను వదలదు. అది పూర్తిగా ఆవిరైపోతుంది — అంటే “ego లేకుండా త్యాగం” అనే భావాన్ని సూచిస్తుంది.

ఆధ్యాత్మికంగా ఇది ఒక సందేశం:

కర్పూరం ఆధ్యాత్మికమైన ఒక గొప్ప సందేశాన్ని మనుషులకు ఇస్తుందట. దేవుడి ముందు మన అహంకారాన్ని కర్పూరంలా కాల్చేయాలనే బావన కల్పిస్తుందట. మన ఈగో (ego) దేవుడి ముందు పూర్తిగా కరిగిపోవాలి. మన మనసు ఖాళీ అయితేనే భక్తి నిజంగా మొదలవుతుంది అని హిందూ సంప్రదాయం చెబుతుంది.

ఆరోగ్యపరంగా ప్రయోజనం:

కర్పూరం కాలినప్పుడు వెలువడే వాసన గాలిని శుభ్రపరచే లక్షణం కలిగి ఉంటుందట. పాత కాలంలో దేవాలయాలు పెద్దగా గాలి తిరిగే ప్రదేశాలు కాకపోవడం వల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, దుర్వాసనలు, తగ్గించడానికి కర్పూరం ఉపయోగించేవారట. అందుకే దేవుడి దగ్గర  హారతి ఇచ్చిన తర్వాత ఆ వాసనను లోపలికి పీల్చమని చెబుతారు. ఇలా పీల్చడం వల్ల కూడా కర్పూర వాసన ఒక రకంగా నేచురల్ డిస్ ఇన్ఫెక్టెంట్ లా పని చేస్తుందట.

మానసిక ప్రభావం:

కర్పూరం కాలినప్పుడు వచ్చే వాసన మనుషులు పీల్చినప్పుడు మెదడులోని వాసన వెళ్లడం వల్ల ఆ వాసనలకు మెదడు చాలా సున్నితంగా స్పందిస్తుదట. దీంతో మానసికమైన ఉల్లాసాన్ని ఆస్వాదిస్తామని చెప్తున్నారు. అప్పుడే మనిషి తన టెన్షన్లు మొత్తం మర్చిపోయి.. ప్రశాంతంగా ఉంటాడట.. పైగా చేస్తున్న పని మీద ఏకాగ్రత్త పెరుగుతుందట. అందుకే హారతి సమయంలో మనకు ఒక ప్రశాంత భావన వస్తుంది. ఇది కేవలం భక్తి వల్లే కాదు మన నర్వస్ సిస్టమ్ పై పడే ప్రభావం కూడా.

హారతిని కళ్లకు అద్దుకోవడం:

దేవుడి దగ్గర కర్పూర హారతిని తీసుకున్న తర్వాత చేతులను వేడికి దగ్గర పెట్టుకుని కళ్లకు తాకిస్తాం. దీనికి కూడా ఒక అర్థం ఉందట దేవుని వెలుగు తమ చూపులోకి రావాలి కోరుకోవడం. అంటే మనం ప్రపంచాన్ని ధర్మం, మంచితనం, సానుకూలతతో చూడాలి అనే భావన ఏర్పడటమట.

కర్పూరం మన జీవితానికి ఒక ప్రతీక:

కర్పూరం ఎలా పూర్తిగా కాలిపోయి వెలుగును ఇస్తుందో మన జీవితం కూడా ఇతరులకు మంచిని ఇచ్చేలా ఉండాలి అనే సందేశం ఇందులో దాగి ఉంది. అందుకే హిందూ ఆలయాల్లో చివరగా కర్పూర హారతి ఇస్తారు. ఇది కేవలం ఆచారం కాదు. మనసు, ఆరోగ్యం, ఆధ్యాత్మికత మూడు కలిపిన ఒక సంపూర్ణ విధానం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ మూడు రాశులకు ఎలినాటి శని – తీవ్రమైన కష్టాలకు ఆ రెమెడీ ఒక్కటే పరిష్కారమట

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×