Lord Narasimha – Shiva: నరసింహ్మస్వామితో పరమశివుడు ఎందుకు యుద్దం చేశాడో తెలుసా..? ఆ యుద్దంలో మొదట శివుడు ఘోరంగా ఓడిపోయాడని మీకు తెలుసా..? ఓడిపోయిన ఆవేశంలో శివుడు, నరసింహుడిని మీద విరుచుకుపడి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మారిపోయాడని ఎంత మందికి తెలుసు. ఇద్దరి మధ్య యుద్దం జరుగుతుంటే బ్రహ్మండాలే బద్దలయ్యేంత ప్రళయం ఏర్పడిందని మీలో ఎవరికైనా తెలుసా..? అసలు శివుడు, నరసింహుడు మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితులేంటో రెండవ సారి యుద్దంలో శివుడు ఎంతలా విశ్వరూపం చూపించాడో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
శివకేశవులుక బేధం లేదని పండతులు చెప్తుంటారు. ఇద్దరిలో ఎవరిని మొక్కినా రెండో వారిని కూడా మొక్కినట్టేనని అంటుంటారు. అంతలా ఉంటుంది ఆ హరిహరాదుల మధ్య బాండింగ్ కానీ వారిద్దరి మధ్యే భయంకరమైన యుద్దం జరిగింది. ఆ యుద్దం ధాటికి ముల్లోకాలు గజగజ వణికిపోయాయి. కింద భూమి పైన ఆకాశం దద్దరిల్లిపోయాయట. అసలు బ్రహ్మండం మొత్తం బద్దలైపోయేంతగా వారి మధ్య యద్దం జరిగిందట. అసలు ఇద్దరి మధ్య యుద్దం ఎందుకు జరిగింతో ఇప్పుడు తెలుసుకుందాం.
శివపురాణం ప్రకారం హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదట. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు ఎంత ప్రార్థించినా నరసింహ్మస్వామి శాంతించలేదట. గట్టిగా గర్జిస్తూ.. ముల్లోకాల్ల్లో ప్రళయం సృష్టిస్లాడట. ఈ మహ రౌద్రాన్ని చూసిన దేవతలందరూ ప్రాణభయంతో మహాశివుణ్ని రక్షించమని అడుగుతారట. అపుడు మహా శివుడు వీరభద్ర అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపచేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడట. కానీ నరసింహ స్వామి వీరభద్రుడి మీదే ప్రతి దాడి చేస్తాడట. వీరభద్రుడు నరసింహ్మస్వామిని కంట్రోల్ చేయలేకపోతాడట.
నరసింహ్మస్వామిని వీరభద్రుడిగా శాంతింపజేయలేకపోవడంతో పరమశివుడు మరో అవతారం ఎత్తుతాడట. అదే అతి భయంకరమైన అత్యంత శక్తివంతమైన శరభావతారం. అత్యంత ఘోర రూపం ఈ శరభావతారం. శరభేశ్వరుడికి, నరసింహ్మస్వామికి మధ్య అతి భయంకరమైన యుద్దం జరుగుతుందట. వారి యుద్దానికి ముల్లోకాలు కంపిస్తాయట. శరభుడి రెక్కల శబ్దంతో ఆకాశం కంపించిందట. చివరికి నరసింహుడి అవతారాన్ని శరభ తన అపారశక్తితో కట్టడి చేస్తాడట.
అప్పడు నరసింహుడికి అర్థం అవుతుందట. ఇంత శక్తివంతమైన శరభ మరోవరో కాదు ఆ పరమేశ్వరుడే అనుకుని వెంటనే నరసింహుడు శాంతించి భక్తితో శివ స్తోత్రం చదవడం ప్రారంభించాడట. దీంతో శరభేశ్వర అవతారంలో ఉన్న శివుడు శాంతించి తన లోనే నరసింహ స్వామిని ఐక్యం చేసుకుంటాడట. ఇది యుద్దం కాదు శివవిష్ణు ఏకత్వాన్ని వెళ్లడించడానికి జరిగిన ఘట్టంగా పండితులు అభివర్ణిస్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.