Big Stories

plant shade : ఇంటిపై మొక్కల నీడ ఆ సమయంలో అసలు పడకూడదా?

plant shade

plant shade : గృహ నిర్మాణాలకు వాస్తు ఉన్నట్టే మొక్కలకు కూడా వాస్తు వర్తిస్తుంది. అందుకే మొక్కలను కూడా సరిగ్గా వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని నాటాలి. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి.

- Advertisement -

ఇంట్లో పూల తోటలను ఏర్పాటు చేసుకునే ఆ గృహ యజమాని వాస్తు సూత్రాలను పాటింస్తే మంచిది సూచిస్తున్నారు. ఇంట్లో లేదా ఆఫీసులోనే చిన్న మొక్కలను నాటడం వల్ల అవి తాజాదనాన్ని అందిస్తాయి . వాతావరణాన్ని ఆహ్లాదంగా , అందంగా మారుస్తాయి.

- Advertisement -

అంతే కాదు ఈ మొక్కలు సరిగ్గా ఎక్కడ నాటితే శాంతి, ఆనందాన్ని కలిగిస్తాయో వాస్తుశాస్త్రం చాలా క్షుణ్ణంగా చెప్పింది. మొక్కలు ఇంట్లో పాజిటివ్ శక్తిని ఇస్తాయి. అలాగే ఇంట్లో తోటను ఏర్పాటు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అయితే తోటలోని ప్రతి విభాగం పంచ మహా భూతాలలోని ఐదు అంశాలలో ఒక అంశాన్ని పోలి ఉంటుంది. .

ఈశాన్యం దిక్కు జలాన్ని ఆగ్నేయం అగ్నిని సూచిస్తుంది. వాయువ్యం గాలిని నైరుతిలో ఉద్యానవనం కలిగిస్తుంది. అయితే తోట నిర్మించేటప్పుడు తూర్పు లేదా ఉత్తర విభాగాలలో చిన్న పొదలను నాటాలి. ఈశాన్యభాగాన్ని తెరిచి వదిలేయాలి. పశ్చిమ, నైరుతి, దక్షిణ దిక్కుల్లో పొడవుగా పెరిగే చెట్లను నాటాలని సూచిస్తున్నారు..

ప్రధాన ఇల్లు, చెట్ల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాటి నీడ ఇంటిపై అసలు పడకూడదు.అలాగే పెద్ద చెట్లను కూడా ఇంటికి చాలా దగ్గరగా నాటకూడదు.ఎందుకంటే వాటి మూలాలు ఇంటి పునాదిని దెబ్బతీస్తాయి. అలాగే కీటకాలు, పురుగులు, తేనెటీగలు లేదా పాములు ఇలాంటి వాటిని ఆకర్షించే చెట్లను తోటలో నివారించాలి.అలాంటి చెట్లను నాటితే దురదృష్టాన్ని తెస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News