Big Stories

Nuclear medicine : క్యాన్సర్ చికిత్స కోసం న్యూక్లియర్ మెడిసిన్..

Nuclear medicine

Nuclear medicine : ఒకప్పుడు చాలావరకు ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు చికిత్స లేని వ్యాధి అంటూ లేదు. అయినా కూడా కొన్ని వ్యాధులు మనుషులను బలిదీసుకుంటున్నాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌కు చికిత్స లేదా అంటే ఉంది కానీ అది పూర్తిగా క్యాన్సర్ పేషెంట్ల ప్రాణాలను కాపాలేకపోతోంది. అందుకే ఇప్పటికీ ఈ కోణంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఒక కొత్త రకం మెడిసిన్‌ను తయారు చేసే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు.

- Advertisement -

న్యూక్లియర్ మెడిసిన్స్ అనేవి గత కొన్నేళ్లలో మనుషులకు ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే క్యాన్సర్‌కు కూడా న్యూక్లియర్ మెడిసిన్ అనేది పనిచేసే అవకాశం ఉందని ఫిలిప్పిన్ శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చింది. ఇప్పటికే ఎన్నో నాన్ కమ్యూనేబుక్ వ్యాధులకు న్యూక్లియర్ మెడిసిన్ మెరుగ్గా పనిచేస్తుంది కాబట్టి క్యాన్సర్‌కు కూడా పనిచేసే అవకాశం ఉందని వారు నమ్ముతున్నారు. కృత్రిమ మందులు కాకుండా న్యూక్లియర్ మెడిసిన్స్ అనేవి ఫార్మా రంగంలో దూసుకెళ్లడం మంచి విషయమని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

ఇప్పటికే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అనేది క్యాన్సర్‌ను గుర్తించడంలో ఉపయోగపడుతోంది. అంతే కాకుండా డిమెన్షియాను గుర్తించడంలో కూడా న్యూక్లియర్ టెక్నాలజీ సక్సెస్ సాధించింది. అందుకే ఫిలిప్పిన్స్‌లోని పలువురు సైన్స్ నిపుణులు కలిసి న్యూక్లియర్ మెడిసిన్‌తో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముందుగా క్యాన్సర్‌కు దీని ద్వారా చికిత్సను అందించాలని భావిస్తున్నారు.

2021లో ఫిలిప్పిన్స్‌లో దాదాపు లక్ష మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అంతే కాకుండా ప్రతి గంటకు ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి బయటపడుతుందని, రోజుకు కనీసం 96 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తేలింది. అందుకే ఎలాగైనా ఆ దేశంలో క్యాన్సర్‌ను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం అక్కడ క్యాన్సర్ డయాగ్నాసిస్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా ఉంది. అలాంటి సందర్భంలో దానికి చికిత్సను పొందడం మధ్య తరగతి కుటుంబాలకు కష్టంగా ఉంటుంది. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News