ఎవరి జీవితమైనా ఆనందంగా ఉండాలంటే చేతిలో డబ్బు ఉండాలి. డబ్బుతోనే పిల్లలకు, కుటుంబానికి కావలసిన అన్ని సౌకర్యాలను అమర్చగలము. అయితే జీవితంలో డబ్బుకు కొదవ లేకుండా ఉండాలి. అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరే గురవుతారు. కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.
ఒక రోజులో సమయాన్నిబట్టి మనము పనులు చేయాలి. చాలామంది సాయంత్రం వేళల్లో లేదా రాత్రి పూట దానం చేయడం, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి చేస్తారు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి కోపం తెప్పించే విషయాలు. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ కూడా ఏ వస్తువును దానంగా కానీ అప్పుగా గాని ఇవ్వకూడదు. అలా చేస్తే మీరు త్వరగా పేదవారయ్యే అవకాశం ఉంటుంది.
పెరుగు, ఉప్పు
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ కూడా పెరుగు ఉప్పు లేదా చక్కెర వంటివి దానంగా లేదా అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేయడం శుక్ర గ్రహం పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఇంట్లోని సంపద, శ్రేయస్సు తగ్గిపోతుంది. అదే ఉప్పును దానంగా లేదా అప్పుగా ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వారి జీవితాల్లో గొడవలు కూడా పెరుగుతాయి. ఇక్కడ సాయంత్రం పూట చక్కెరను ఇవ్వడం వల్ల వారి జీవితాల్లో ఆనందం, శాంతి వంటివి తగ్గిపోతాయి.
పసుపు
ఇంట్లో ఉన్న పసుపును కూడా సాయంత్రం వేళ దానం చేయకూడదు. పసుపుకి బృహస్పతి గ్రహానికి అనుబంధం ఉంటుంది. సాయంత్రం పూట పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి స్థానం బలహీనపడుతుంది. ఇది గౌరవం, జ్ఞానం, కుటుంబ ఆనందం పై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
తులసి
తులసి మొక్క ప్రతి హిందూ భక్తుడి ఇంట్లో ఉంటుంది. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను లేదా తులసి మొక్కను దానం చేయడం మంచిది కాదు. ఇది ఇంట్లో వారికి ఆర్థిక ఇబ్బందులను పెంచుతుంది.
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం సాయంత్రం పూట డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా అశుభమే. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి నిష్క్రమించే అవకాశం ఉంది. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా అధికంగా వస్తాయి.
సూది కత్తెర
సాయంత్రం వేళల్లో ఎవరికైనా సూది, కత్తెర వంటి పదునైన వస్తువులు ఇవ్వడం మానేయాలి. ఇలా ఇస్తే వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అలాగే వారి సంబంధాలలో ఉద్రిక్తతలు కూడా వస్తాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇక్కడ చెప్పిన ఏ వస్తువులను కూడా మీరు సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత దానంగా గాని అప్పుగా గాని ఇవ్వకండి.