Tollywood Producer: ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్న బన్నీ వాసు (Bunny Vasu) తాజాగా సింగిల్ థియేటర్ బంద్ పై స్పందించారు. అసలు విషయంలోకి వెళ్తే.. గత నెల రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలోకి ఇప్పుడు హీరోలు కూడా వచ్చి చేరిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ పై నెలకొన్న వివాదంపై కూడా నిర్మాత బన్నీ వాసు తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా స్పందించారు.
పర్సంటేజ్ కాదు.. ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడం తెలియాలి- బన్నీ వాసు
ఆయన తన ఎక్స్ ఖాతాలో.. పర్సంటేజ్ విధానం కాదు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పర్సంటేజ్ సిస్టంలో మార్పుల కోసం పోరాడడం కంటే.. ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి ఎలా రప్పించాలనే దానిపైనే దృష్టి సారించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటీటీ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే ఐదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం సినీ పెద్దలు, హీరోలు కూడా ఆలోచించాలి అంటూ బన్నీ వాసు తెలిపారు. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకువెళ్లాలి అని ఆలోచించాలి.
also read:Shubhashree-Rayaguru:ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ నిశ్చితార్థం.. వరుడు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ముందుగా పెద్ద హీరోలే ఆలోచించాలి – బన్నీ వాసు
అలాగే సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీ కి ఇవ్వాలి అనే ట్రెండ్ ను తీసేయాలి. ఇక పెద్దపెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా లేదా మూడు సంవత్సరాల కు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మైంటైన్ చేయలేక మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక సింగిల్ స్క్రీన్స్ మూతబడితే.. మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉంటాయి. పెద్ద హీరోలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
అయితే ఇక్కడ మరొకటి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుంది.. అంటూ బన్నీ వాసు తెలిపారు. మొత్తానికి అయితే నిర్మాత బన్నీ వాసు అందరికీ గట్టిగా ఝలక్ ఇస్తూ.. పర్సంటేజ్ కాదు ముందు ప్రేక్షకుడిని థియేటర్ కి ఎలా రప్పించాలో ఆలోచించుకోండి అంటూ కామెంట్లు చేశారు.. ప్రస్తుతం ఈయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బన్నీ వాసు విషయానికొస్తే గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా అల్లు అరవింద్ తో కలిసి పలు సినిమాలో నిర్మిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే బన్నీ వాసు థియేటర్ బంద్ విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి మిగతా పెద్దలు ఎలా ఆలోచిస్తారో చూడాలి.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025