BigTV English
Advertisement

YSRCP: జాగ్రత్తగా వైసీపీ అడుగులు.. ఈసారి ఆ విధంగా ముందుకు

YSRCP: జాగ్రత్తగా వైసీపీ అడుగులు.. ఈసారి ఆ విధంగా ముందుకు

YSRCP: వైసీపీ యాక్టివ్ అవుతుందా? ఏడాది కాలంగా దూరంగా ఉన్న జగన్ యాక్టివ్ మూడ్‌లోకి రానున్నారా? ఏడాది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైందా? జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల వెనుక అసలు స్కెచ్ ఏంటి? గతంలో ఇంప్లిమెంట్ చేసిన ఫార్ములానే ఈసారి అవలంభించాలని భావిస్తోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.


ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి జూన్ 12 తో ఏడాది కానుంది. కూటమి సర్కార్‌పై అడపా దడపా ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ‘వెన్నుపోటు దినం’ పేరిట రెండురోజుల కిందట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ ప్రొగ్రాంకు ప్రజల నుంచి పెద్దగా మైలేజ్ రాలేదని భావించింది.  ఉమ్మడి 13 జిల్లాల్లో పెద్దగా హైలైట్ అయిన సందర్భం రాలేదు.. కనిపించలేదు.

ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వంపై ప్రజల్లో నెగిటివ్ ఉందా లేదా కనుగొనేందుకు ఐవీఆర్ పద్దతి ద్వారా ఫోన్ సర్వే చేయించిందట వైసీపీ. అందులో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలీదు. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. దానికి కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ఉమ్మడి 13 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది.


ఈ సమావేశానికి మేధావులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ అధికారులు, పౌర సమాజ సభ్యులు, రైతు నాయకులను ఒక చోట చేర్చి చర్చించాలని భావిస్తోంది. జూన్ చివరినాటికి వీటిని పూర్తి చేయాలని భావిస్తోంది. ఆయా సమావేశాలకు అధినేత జగన్ హాజరవుతారా? లేదా అన్నది ఆ పార్టీ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.

ALSO READ: మురికి కాలువలో ఆ ఇద్దరు, నిమిషాల్లో పోయే ప్రాణాలు

పార్టీ కార్యాలయం నుంచి సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రాంతీయ సమన్వయకర్తలు, అనుబంధ విభాగం అధ్యక్షులు సీనియర్ నాయకులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని చెప్పే ప్రయత్నం చేశారట.

వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందని, దీనికి కొనసాగింపుగా ప్రభుత్వంపై నిరసనలను కంటిన్యూ చేయాలని చెప్పారట. రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి సర్కార్ విద్యను ఎలా నాశనం చేసింది? యువతను, రైతులను ఎలా మోసం చేసింది? మహిళా సంక్షేమ పథకాలను ఎలా బలహీనపరిచింది అనే అంశాలపై ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.

వీటిపై చర్చించిన తర్వాత ప్రజలకు వాటిని తెలియజేయాలని భావిస్తోందట ఆ పార్టీ. ఇదంతా ఒకవైపు వెర్షన్.  మరోవైపు టెలికాన్ఫరెన్స్‌లో నేతలు మాట్లాడేందుకు ఏ మాత్రం మొగ్గు చూపలేదట.  ఎంతసేపు సరే అంటూ చెప్పుకొచ్చారట. వారి అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేయలేదని కొందరు నేతలు లోలోపల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

2014-19 మధ్య ఇలాగే రౌండ్ టేబుల్ పేరిట వైసీపీ సమావేశాలు ఏర్పాటు చేసిందని కొందరు నేతలు అంటున్నారు.  అప్పట్లో జగన్ పాలన ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదన్నారు. ఒక్క ఛాన్స్ అనేసరికి అవకాశం ఇచ్చారని, గడిచిన ఐదేళ్లు దాని ఫలాలు ప్రజలు అనుభవించారని అంటున్నారు. దాని ఫలితమే వైసీపీ చిత్తు ఓడియిందని అంటున్నారు. ప్రభుత్వాలపై నిరసన తెలిపే ముందు మనలో మార్పు రావాలని అంటున్నారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×