BigTV English

Lord Shiva: ఈ రాశులపై శివుడి అనుగ్రహం.. మీది కూడా ఈ రాశేనా ?

Lord Shiva: ఈ రాశులపై శివుడి అనుగ్రహం.. మీది కూడా ఈ రాశేనా ?

Lord Shiva: జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే 12 రాశుల్లో నాలుగు రాశులు మాత్రం శివుని అంశతో ఉన్నాయి. ఈ నాలుగు రాశులు శివుడికి చాలా ఇష్టమట. నాలుగు రాశుల వారిలో ఉండే లక్షణాలు అంటే శివుడికి చాలా ఇష్టం. అందుకే ఈ నాలుగు రాశులు శివుని అంశతో వచ్చాయని చెబుతారు. తనకు కృపను కూడా నాలుగు రాష్ట్రాలపై శివుడు ఎప్పుడూ ఉంచుతాడని పండితులు చెబుతున్నారు.


తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి శివుడు ఆశీస్సులు ఇస్తాడు. వారికి అండగా ఉంటూ వరాలిస్తాడు. ఈ నాలుగు రాశుల వారు కూడా ఎప్పుడూ శివుడి పట్ల విధేయతను కలిగి ఉంటారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి :
మీ మనస్సు చాలా స్వచ్ఛమైనది. మీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా ప్రతి ఒక్కరితో పంచుకునేందుకు ఇష్టపడతారు. మీలో క్షమాగుణం ఎక్కువ. మీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. అంతే కాకుండా మీ మనస్సు కూడా చాలా విశాలమైంది. ఏది పొందాలన్నా కష్టపడి పొందుతారు. మోసపూరితంగా పొందాలని అస్సలు అనుకోరు. ఇతరులను నమ్మి మోసపోయే లక్షణాలను కలిగి ఉంటారు. మీరు ఇష్టపడే వ్యక్తులకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఇతరుల సొమ్మును అస్సలు ఆశించరు. వారికి ఏదైనా సమస్య వచ్చినా లేక కుటుంబ సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడడానికి ఇష్టపడతారు. ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. శివుడు వీరికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అవి వారి ఎదుగుదల కోసమే అని అర్థం చేసుకోవాలి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అంతే కాకుండా మన్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి. అలాగే మనకి మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకువస్తాయి. కర్కాటక రాశి వారికి దైవం పట్ల నమ్మకం, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. సరైన మార్గంలోనే వెళ్లాలని అనుకుంటారు. అడ్డదారులు వీరికి అస్సలు నచ్చవు. ఏ పని చేసినా తగిన ఫలితాన్ని మీరు ఆశించరు. ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉంటారు. శివుడి తన దయను ఎప్పుడు కర్కాటక రాశిపై ఉంచుతాడు. కర్కాటక రాశి వారికి సహాయ గుణం ఎక్కువ అందుకే శివుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు
కుంభ రాశి :
కుంభరాశి వారికి కూడా దైవం పట్ల భక్తి ఎక్కువగానే ఉంటుంది. మీరు మీ భక్తిని బయటకు చూపించరు. ఎవరూ లేనప్పుడు భక్తిని దేవుడి వద్ద చూపిస్తారు. కుంభరాశి వారు, వారికి చెందినవారు కష్టాల్లో ఉన్నా చూడలేరు. మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. మీరు కూర్చున్న చోటే అన్ని పనులు జరగవని నమ్ముతారు. ప్రతి విషయాన్ని నేర్చుకునే తపనను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు అబద్దాలు ఆడరు. చాలా అమాయకులు, మంచివారు. అందుకే కుంభరాశి వారికి శివుడంటే చాలా ఇష్టం.

Also Read: కుజుడి సంచారంతో ఈ రాశుల వారికి గడ్డుకాలం..


మేష రాశి :
మేష రాశి వారు ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. భగవంతుడిపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ దేవుడిని పూజిస్తారు. భగవంతుడి విషయంలో అసలు నిర్లక్ష్యం చేయరు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువలను ఇస్తూ ఉంటారు. ప్రతి పండగను చక్కగా నియమ నిబంధనలతో జరుపుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సమయపాలన కచ్చితంగా పాటిస్తారు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×