జ్యోతిష్యాలకి, సైన్స్ కు ఎంతో దూరం ఉంది. జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు సైన్స్ ను నమ్మరు. సైన్స్ ను నమ్మేవారు జ్యోతిష్యానికి దూరంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు జ్యోతిష్యం కూడా నిజమవుతూ ఉంటుంది. దీనివల్ల ఇప్పటికీ ఆస్ట్రాలజీని నమ్మే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని అంచనాలను వేస్తూ ఉంటారు. జ్యోతిష్యంలో రాశులలో పుట్టే వారి లక్షణాలు వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో అంచనా వేసి చెబుతూ ఉంటారు. అలా అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులైన రాశుల గురించి కూడా చెప్పారు. అలాంటి రాశులు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆ రాశుల్లో మీది ఉందో లేదో చూసుకోండి.
మిధున రాశి
ఆంగ్ల జ్యోతిష్యం ప్రకారం మే 21 నుండి జూన్ 20 మధ్య జన్మించిన వారికి మిధున రాశిలో జన్మించినట్టు వస్తుంది. వీరు సామాజికంగా బాగా కలిసి పోతారు. అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలరు. ఏ నిజాన్ని అయినా త్వరగా వక్రీకరించి అబద్ద గా మార్చగలరు. అవసరమైనప్పుడు నమ్మదగిన కథలను చెప్పి ఆ పని పూర్తి చేసుకోగలరు. మీరు కూడా మే 21 నుండి జూన్ 20న మధ్యన జన్మించి ఉంటే మీకు ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 మధ్య జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరు ఏ విషయాన్ని అయినా రహస్యంగా ఉంచుతారు. ప్రతిదీ వ్యూహాత్మకంగా చేస్తారు. వారి కదలికలు ఎదుటి వారికి త్వరగా అర్థం కావు. వారు తమ ప్రయోజనాల కోసం సత్యాన్ని దాచడంలో, మార్చడంలో నిష్ణాతులు. తమకు తగ్గట్టు ప్రతి ప్రణాళికను వేసుకుంటారు.
తులారాశి
సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 మధ్య జన్మించిన వ్యక్తులు తులా రాశిలోకి వస్తారు. తులారాశి సూర్యుడికి చెందిన రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చూసేందుకు మనోహరంగా ఉంటారు. అయితే జీవితంలో ఎక్కువగా ఘర్షణలు పడుతూ ఉంటారు. తులా రాశి వారు శాంతియుతమైన జీవితాన్ని కాపాడుకోవడం కోసం తరచూ అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇతరులతో తియ్యగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.
మీన రాశి
ఫిబ్రవరి 19 నుండి మార్చ్ 20 మధ్యన జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. వీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఊహాత్మకంగా పనిలో చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వీరికి అధికంగా ఉంటాయి. అబద్ధం చెప్పడంలో వీరు నిష్ణాతులు. నిజాన్ని కూడా అబద్ధంగా నమ్మించి ఎదుటివారిని ఏమారుస్తారు. తమను తాము రక్షించుకోవడానికి ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారు.
సింహరాశి
సింహ రాశి వారు జూలై 23 నుండి ఆగస్టు 22 మంది జన్మించిన వారు. ఇందులో జన్మించిన వ్యక్తులు నాయకులు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ వీరి చుట్టూ ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే వీరు తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఇతరులకు అబద్దాలు చెబుతూ ఉంటారు. ఆ అబద్ధాలు ఎదుటివారిని కూడా ఆకట్టుకుంటాయి.
Also Read: కొత్త ఏడాది వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి, ఆరోజు ఈ పనులు చేస్తే ఏడాదంతా ఆనందమే