Hyderabad Formula E Race Case: ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. మరోసారి ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకే ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చామని అవినీతి పనులు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటు అని అన్నారు. తాము తప్పు చేసే ప్రసక్తే లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నాయకత్వంలో పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధతతో ఎక్కడా పైసా అవినీతికి తావు లేకుండా పని చేశానని విచారణలో ఏసీబీ అధికారులకు కూడా ఇదే చెప్పానని అన్నారు. మొత్తం ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు అడిగారని.. అయితే అడిగిన ప్రశ్నలు రిపీట్‌గా అడిగారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా తనపై కేసు పెట్టించాడని ఏసీబీ అధికారులకు కూడా అర్థమైందని ఎద్దేవా చేశారు. తనను విచారించడానికి అధికారులు కూడా ఇబ్బందిపడుతున్నారని.. ఎందుకంటే కేసులో విషయం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఫార్ములా-ఈ రేస్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోనే ఉంచాలని.. తాను కష్టపడి తొలిసారి భారత్‌కు మొదటిసారి ఈ ఈవెంట్‌ను తీసుకువచ్చామని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్, తెలంగాణను ఒక ప్రధాన స్థావరంగా చేయాలని ఒక విజన్‌తో చేసిన పనితప్ప మరొక అవినీతి పనిలో అందులో ఏం లేదని చెప్పారు. అవినీతి పనులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప.. తమకు అలవాటు లేదని అన్నారు.
అవినీతి పనులు చేసేందుకు తమకు ఏ ఖర్మ పట్టలేదని కుండబద్దలు కొట్టినట్లు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు వివరించారు. ‘ఏసీీబీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా వస్తాను. విచారణకు హాజరయ్యేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి ఒక విజ్ఞప్తి చేశాను. నాపై కేసు పెట్టారు. విచారణ కూడా చేస్తున్నారు. పర్వాలేదు. ఇలాంటివి వంద కేసులు పెట్టినా భయపడం. ఎదుర్కొంటాం. మీ ప్రభుత్వం, మీరు ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని రకాల ప్రయత్నం చేసినా.. మేం ప్రజా సమస్యల గురించే మాట్లాడుతాం.
Also Read: AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000
కచ్చితంగా ప్రతి సమస్యను, ఆరు గ్యారంటీలు, 420 హామీలపై మాట్లాడుతాం. ఇలాంటి కేసులు వంద కేసులు పెట్టినా.. మాట్లాడడం వదిలిపెట్టం మీరు ఎత్తగొట్టిన రైతుభరోసా, మీరివ్వని రూ.4వేల పెన్షన్ గురించి మాట్లాడుతాం. ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రూ.2500 గురించి మాట్లాడుతాం. ఇస్తానని చెప్పిన 2లక్షల ఉద్యోగాల విషయంలో మా పిల్లలైనా నిరుద్యోగుల గురించి కొట్లాడుతాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.