PGCIL Jobs: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 25 కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 25
అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముందుగా 2 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. సంస్థ అవసరాలతో పాటు, అభ్యర్థి పనితీరు ఆధారంగా ప్రతిఏటా దీన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
కాంట్రాక్ట్ గరిష్ఠ కాలపరిమితి 5 ఏళ్లు. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్ విభాగంలో 11, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 7 పోస్టులు, ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 2 పోస్టులను కేటాయించారు.
విద్యార్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష, కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)లో అసోసియేట్ సభ్యులైవుండాలి. వర్కింగ్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎజెండా డ్రాఫ్టింగ్, మినిట్స్, అఫిషియల్ లెటర్ రాయడం, బోర్డు/ కమిటీ, జనరల్ బాడీ మీటింగ్‌లు నిర్వహించడంలో అభ్యర్థికి అనుభవం ఉండాలి. శిక్షణ, ఇంటర్న్‌షిప్ కాలాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా పరిగణించరు.
వయస్సు: 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు ప్రభుత్వ రూల్స్ అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.400 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించి ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ తయారుచేస్తారు. దీంట్లో అన్‌రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్‌లు 40 శాతం, రిజర్వుడ్ కేటగిరీకి చెందినవారు 30 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి. ఇంటర్వ్యూలోనూ ఇదేవిధంగా మార్కులు సాధించాల్సి ఉంటుంది.
జీతం: నెలకు రూ.30,000-1,20,000 వరకు ఉంటుంది. మూలవేతనానికి(బేసిక్కు) అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్, గ్రాట్యుటీ, వైద్య, ఇన్సూరెన్స్ మొదలైన సదుపాయాలు ఉంటాయి.
దరఖాస్తుకు చివరితేది: 2025 జనవరి 16
Also Read: AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000
ముఖ్యమైనవి:
ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను దరఖాస్తులో రాయల్సి ఉంటుంది. వీటితోపాటు ప్రత్యామ్నాయ సెల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను కూడా పేర్కొనాలి.
ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్‌సైట్: http://www.powergrid.in