BigTV English

Ashada Masam importance : ఆషాడమాసంలో చేయకూడని పనులు

Ashada Masam importance : ఆషాడమాసంలో చేయకూడని పనులు
Ashada Masam


Ashada Masam importance : 2023 లో జూన్ 19న ఆషాడ మాసం మొదలై జూలై 17నతో ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడంమాసంలోనే దక్షియానం మొదలవుతుంది. పౌర్ణమి రోజు ఉత్తరాషాడన నక్షత్రాన రావడంతో ఆషాడమని పేరు వచ్చింది. వర్షాకాలం మాసం ప్రారంభమవుతుందడానికి ఇదే సంకేతం. శ్రీమహావిష్ణువు శయన ఏకాదశి తొలి ఏకాదశి ఈమాసంలోనే వస్తుంది. విష్ణుభక్తులు చాత్మురాస వ్రతాన్ని ఆచరించే సమయం కూడా ఇదే. ఆషాడ మాసంలో శుభకార్యాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. వివాహాది కార్యక్రమాల జోలికి అసలు వెళ్లకూడదు. శుభకార్యాలు నిర్వహించకూడదు. మాఘం,పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం,ఈ ఐదుమాసాలకు శుభకార్యాలు నిర్వహించవచ్చు . సంవత్సరంలో సగం కాలం ఉత్తరాయణం, మలి దక్షిణాయనం ఉంటుంది. దక్షిణాయనం కంటే ఉత్తరాయణం శ్రేష్టం.

సూర్య భగవానుడి తేజస్సు ఎక్కువ సమయంలో ఉత్తరాయణం, ఆదిత్యుడి తేజస్సు తక్కువగా ఉండే సమయం దక్షిణాయనం. ఉత్తరాయణంలో శ్రీమహా విష్ణువు జాగురూకులై ఉంటారు. దక్షిణాయనంలో విష్ణువు శయనిస్తారు అంటే నిద్రించే సమయం. ఆషాడ మాసం శూన్యమాసం. అందువల్ల ముహూర్తాలు ఉండవు కాబట్టి పెళ్లిళ్లు చేయకూడదు. ఆషాడం అనారోగ్య మాసంగా కూడా చెబుతారు. కారణం కొత్తనీరు ప్రవేశించడం, అది తాగడం వల్ల వాంతుల, విరోచనాలు, చలిజ్వరం తలనొప్పి మొదలైన రోగాలు వస్తాయి. క స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూల సమయం కూడా కాదు. అశుభ సమయాల్లో, అనారోగ్య సమయంలో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఒక కారణం. ఇలా అనేక కారణాల రిత్యా ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఈమాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు కాబట్టి ఆషాడ మాసంలో కొత్త జంట కలవకూడదన్న నియమం పెట్టారు.


ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు. చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలు ఈమాసంలో చేస్తారు. మనిషిలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎండా కాలం వేడి భూతాపం పెరిగి వర్షాకాలంలో భూమిలోకి నీరు ఇంకుతుంది. అలా పండే కూరగాయలను తినకూడదని నియమం పెట్టారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×