BigTV English

Horoscope 23 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం..శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం!

Horoscope 23 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం..శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం!

Astrology 23 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళిలో స్పష్టత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసులు అందుతాయి. ప్రమోషన్స్ ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. శివనామస్మరణ ఉత్తమం.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు రెట్టింపు అవుతాయి. దైవబలం పరిపూర్ణంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం.


మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. తోటివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి అభివృద్ధి, ఆర్థిక లబ్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ల పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అవివాహితులకు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఉద్యోగులకు గుర్తింపు ఉంటుంది. విహారయాత్రలకు వెళ్తారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో సమస్యలు ఎదురైన చిత్తశుద్ధితో పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం ఉంటుంది. కానుకలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఈశ్వర సందర్శన శుభప్రదం.

Also Read: కుబేరుడికి ఇష్టమైన ఈ 3 రాశుల వారు లక్షాధికారులు కాబోతున్నారు

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. కీలక పనుల్లో తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. ఆటంకాలు ఎదురైనా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవరినీ నమ్మకుండా ఉంటే మంచిది. కోపంతో ఇబ్బందులు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.

వృశ్చికం:
వృశ్చికం రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక వృద్ధి ఉంటుంది. వ్యాపారాల్లో ఇతరులను కలుపుకోకపోవడం మంచిది. చెప్పుడు మాటలు విని ఇబ్బందులు పడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి ప్రతికూల ఆలోచనలు వీడాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవచ్చు. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. పిత్రార్జితం కలిసి రావడంతో సంతోషంగా ఉంటారు. అవసరానికి సహాయం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇతరులతో వాదనలు దూరంగా ఉండడం మంచిది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సున్నితమైన విషయాలకు ఎక్కువగా స్పందించవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆస్తి తగాదాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. శ్రీసుబ్రహ్మణ్య భుజం స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయవకాశాలు మెరుగవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. శ్రీవెంటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

 

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×