BigTV English

NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్..

NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్..

Ntr : టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, కొరటాలా శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ సినిమాను ఈనెల 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మరి కొద్ది రోజుల్లో సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సంచలన విషయాలను బయట పెట్టారు.. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసిన మేకర్స్ ఎందుకు ఈవెంట్ ను రద్దు చేశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం పై హీరో ఎన్టీఆర్ స్పందించారు.. ఒక వీడియోను రిలీజ్ చేశారు.


NTR apologized for canceling Devara's pre-release event...
NTR apologized for canceling Devara’s pre-release event…

ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మేము ఈ సినిమా కోసం సంవత్సరాలుగా కష్టపడి ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. 6 సంవత్సరాల తర్వాత మా ప్రియమైన మాస్ ఎన్టీఆర్ మొదటి సోలో విడుదలైనందున దీనిని భారీ స్థాయిలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ గణేష్ నిమార్జనానికి చాలా దగ్గరగా షెడ్యూల్ చేయబడింది. ఇలాంటి పెద్ద ఎత్తున ఈవెంట్‌లకు సాధారణంగా కనీసం ఒక వారం ప్రిపరేషన్ అవసరం. దీనికి తోడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక సవాళ్లను సృష్టించాయి. ఈరోజు వర్షం పడనప్పటికీ, మేము ప్లాన్ చేసినప్పటికీ బహిరంగ కార్యక్రమం జరగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావు…

మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, అధిక సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల కారణంగా బారికేడ్‌లు విరిగిపోవడంతో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం ఈవెంట్‌ను రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.మీలో చాలా మంది మీ హీరోని చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించారని అర్థం చేసుకున్నాము. అందరూ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని మేము ఆశిస్తున్నాము. అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. అలాగే పరిస్థితికి నిజంగా చింతిస్తున్నాము. ఇది అర్థం చేసుకుంటారని మనవి.. 27 న సినిమా పక్కాగా విడుదల అవుతుంది అని ఎన్టీఆర్ వీడియో నోట్ ను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


ఇక ఎన్టీఆర్ దేవర సినిమా ఆరేళ్ళ తర్వాత రాబోతుంది.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అటు కొరటాలకు, ఎన్టీఆర్ కు ఈ సినిమా డెడ్ లైన్ లా మారింది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ డైలాగులు.. సీన్స్, ఫైటింగ్ విజువల్స్ ఓ రేంజులో అదిరిపోయాయి. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

 

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×