BigTV English
Advertisement

Saturn Transit 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

Saturn Transit 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

Saturn Transit 2024: శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు 30 ఏళ్ల సమయం పడుతుంది. అలాగే నిర్ధిష్ట కాలం తర్వాత శని నక్షత్రాన్ని కూడా మార్చుకుంటాడు. ప్రస్తుతం శని భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 3 వ తేదీన శతభిషా నక్షత్రంలోకి వెళతాడు. శని ఈ నక్షత్రంలో డిసెంబర్ 27 వరకు ఉంటాడు. శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది.


శతభిషా నక్షత్ర ప్రాముఖ్యత:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రానికి రాహువు అధిపతి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు సత్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయరు. స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఇతరులతో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తారు. తమ కోరికలను నెరవేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజాయితీగా జీవితాన్ని గడుపుతారు. గొప్ప రచయితలుగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. శతభిషా నక్షత్రంలో శని సంచారం ఈ రాశుల వీరికి లాభాలు చేకూరుతాయి.
వృషభ రాశి:
శని నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాశి పదవ ఇంట్లో శని సంచరిస్తాడు. అందువల్ల వృత్తిలో విజయాన్ని పొందే అవకశాలు ఉన్నాయి. వృత్తిపరమైన లక్ష్యాలు కూడా సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలి అని అనుకున్న వారి కల నెరవేరుతుంది. ఆర్థికంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
ధనస్సు రాశి:

ఈ రాశి మూడో ఇంట్లో శని సంచారం జరగుతుంది. ఫలితంగా భౌతిక ఆనందాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం చేసే చోట విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అద్భుతమైన కెరీర్ ఎంపికలు మీ ముందుకు వస్తాయి. పనిలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. స్నేహితులతో ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటంది. ఈ సమయంలో మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది.


మేష రాశి:

శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి రాగానే మేష రాశి వారి జీవితంలో ఆనందం పెరుగుతుంది. కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఆశలన్నీ నిజమయ్యే సమయం ఇది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవితంలో గొప్ప పెరుగుదల ఉంటుంది. కెరీర్‌లో విజయాలను పొందుతారు. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. శని అనుగ్రహం వల్ల మీ అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×