E-Paper
Advertisement

Hassini Sudhir Cute Speech: అందుకే నాకు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం: ‘పురుషోత్తముడు’ హీరోయిన్

Hassini Sudhir Cute Speech: అందుకే నాకు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం: ‘పురుషోత్తముడు’ హీరోయిన్
Advertisement

Hassini Sudhir Cute Speech: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు’. ఈ నెల 26న విడుదల కాబోతున్నది. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తమ అభిప్రాయాలను తెలియజేసింది. హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా విశేషాలను వెల్లడించింది.

‘మాది మహారాష్ట్ర. అయితే, నాకు చిన్నప్పటి నుంచి కూడా హీరోయిన్ కావాలనేది నా కల. అందుకే ముంబైలో మోడలింగ్ చేశా. తెలుగు సినిమాలను బాగా చూస్తూ ఉండేదాన్ని. అలా సినిమాలు చూస్తూ చూస్తూ తెలుగు నేర్చుకున్నాను. ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ భీమన ‘పురుషోత్తముడు’ సినిమా ఆడిషన్‌కు పిలిచారు. ఆ ఆడిషన్ తరువాత నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో నేను అమ్ములు అనే క్యారెక్టర్ చేశాను. ఆ అమ్ములను అంతా అమ్ము అని పిలుస్తారు. ఆ బబ్లీ గర్ల్ అందరితో పని చేయిస్తుంటది. హీరోతో కూడా పని చేయిస్తది. ఈ క్యారెక్టర్‌లో నటిస్తూ నేను చాలా ఎంజాయ్ చేశా. నాకు తెలుగు మాట్లాడడం వచ్చు కానీ, చదవడం, రాయడం రాదు. దీంతో రాజమండ్రి షెడ్యూల్ కోసం వెళ్లి ఫస్ట్ డే షూట్‌లో పాల్గొన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిపడ్డాను. ఇది గమనించిన సీనియర్ యాక్టర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. హీరో రాజ్ తరుణ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో నటించిన నటీనటులందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేశారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ రామ్ భీమనకు థ్యాంక్స్ చెబుతున్నాను.

Advertisement

Also Read: OG సెట్ లో అడుగుపెట్టబోతున్న పవన్.. ?

నా ఫస్ట్ మూవీలోనే నేను చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి వాళ్లతో నటించాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. ఈ సినిమా చూసినంత సేపు మీరు కళ్లార్పకుండా చూస్తారు. సినిమా చూసిన తరువాత మీకు ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు సినిమాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం మరికొన్ని సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. లవ్ స్టోరీస్‌తోపాటు యాక్షన్ మూవీస్‌లలో నటించాలని ఉంది. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటదని భావిస్తున్నా. పురుషోత్తముడు సినిమాకు మంచి విజయాన్ని అందిస్తారని కోరుతున్నా’ అంటూ ఆమె పేర్కొన్నది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×