BigTV English

Rave Party: మాదాపూర్‌లో రేవ్ పార్టీ.. 15 మంది అరెస్టు

Rave Party: మాదాపూర్‌లో రేవ్ పార్టీ.. 15 మంది అరెస్టు

Madhapur: రేవ్ పార్టీ కల్చర్ ఇంకా తగ్గడం లేదు. అనేక చోట్ల ఇలాంటి పార్టీలను పోలీసులు భగ్నం చేస్తున్నా.. అరెస్టులు జరుపుతున్నా.. ఈ సంస్కృతి ఆగడం లేదు. ఇటీవలే బెంగళూరులో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అందులో నటి హేమ అరెస్టు కావడంతో హాట్ టాపిక్ అయింది. తాజాగా.. హైదరాబాద్‌లోనే రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.


మాదాపూర్‌లో సైబర్ టవర్స్ వద్ద గల క్లౌడ్ 9 హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగారెడ్డి ఎస్‌టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అక్కడ రేవ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. స్పాట్‌లో లభించిన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు.

ఈ రేవ్ పార్టీని బేగంపేట్‌కు చెందిన నాగరాజు యాదవ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో 14 మంది యువకులు, ఆరుగురు యువతులు ఉన్నారు. ఇందులో ఐదుగురిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. మిగిలిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో రేవ్ పార్టీ నిర్వాహకుడు నాగరాజు యాదవ్ కూడా ఉన్నారు.


Also Read: పార్లమెంటులో కంగనా ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

స్పాట్‌లో రూ. 1.25 లక్షల విలువైన డ్రగ్స్, మద్యం, విదేశీ మద్యం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. కొకైన్, ఎండీఎంఏ, ఓజీ కుష్ డ్రగ్స్‌తోపాటు విదేశీ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. వీటితోపాటు ఇన్నోవా కారును కూడా సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను యువకులు గోవా నుంచి తీసుకువచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×