BigTV English

Venus Transit: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి సంపద వర్షం

Venus Transit: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి సంపద వర్షం
Advertisement

Venus Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్ధిష్ట విరామం తర్వాత తమ రాశిని, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారం మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్రుడిని లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహంగా చెబుతుంటారు. శుక్రుడు శుభ స్థానం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, సంపద లభిస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం సంపాదనిచ్చే శుక్రుడు పుష్యా నక్షత్రాన్నివదిలి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు.


జులై 20వ తేదీన సాయంత్రం 6:10 గంటల నుంచి శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో సంచరించాడు. 12 రాశుల వారిని ఇది ప్రభావితం చేస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ పరిణామాలు కలుగుతాయి. ఫలితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఆస్తి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు లభిస్తాయి. ఐశ్వర్యం,సంతోషం, విలాసాన్ని శుక్రుడు ఏ రాశుల వారికి ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:
మిథున రాశి వారికి వస్తు సౌకర్యాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వృత్తికి సంబంధించిన శుభవార్తలను కూడా అందుకునే అవకాశముంది. శుక్రుడి శుభ ప్రభావంతో మీ జీవితం మెరుగ్గా ఉంటుంది. భర్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో చాలా ఆర్థిక లాభం కలుగుతుంది.
కన్యా రాశి:
శుక్రుడి నక్షత్ర మార్పు కన్యా రాశివారికి ఆదాయాన్ని పెంచడంతో పాటు కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది. సామాజిక హోదా బాగా పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. శుక్రుడి ఆశీస్సులతో వివాహాలు కూడా కుదిరే అవకాశం ఉంది. మీరు మీ పిల్లల వైపు నుంచి కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభం పొందుతారు.
ధనస్సు రాశి:
శుక్రుడి సంచారంతో ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇప్పటివరకు నెలకొన్న సమస్యలు తొలగిపోయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది.


Also Read: తులా రాశితో సహా ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

కుంభ రాశి:
శుక్రుడి సంచారం వల్ల కుంభ రాశి వారికి వ్యాపారంలో లాభాలకు అవకాశం ఎక్కువగా ఉంది .మీ సంబంధాలలో ప్రేమ, మాధుర్యం బాగా పెరుగుతుంది, పూర్వీకుల ఆస్తి ద్వారా లాభపడతారు. వ్యాపారంలో గొప్ప పురోగతి ఏర్పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

Related News

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Lord Hanuman: పూరిలో బేడి హనుమాన్‌.. భగవంతునికి ఎందుకు బేడీలు వేశారు?

Eye Twitching: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !

Samantha: సమంత పూజిస్తున్న ఈ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ దేవత ఎంత శక్తిమంతురాలంటే ?

Big Stories

×