BigTV English

Ap Assembly inside agitation: వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం..

Ap Assembly inside agitation: వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం..

Ap Assembly inside agitation: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభ మయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌‌నజీర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాయి. అయితే సభలో వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరకు వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గాల్సివచ్చింది.


గవర్నర్ స్పీచ్ ముఖ్యమైన పాయింట్లు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని కొనియాడారు. విభజన వల్ల ఏపీకి భారీ నష్టం కలిగిందన్న ఆయన, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొని మార్పు కావాలని ఆకాంక్షించారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందన్నారు.

వైసీపీ ప్రభుత్వ పాలనపై గవర్నర్ అబ్దుల్‌నజీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగావున్న తెలుగు ప్రజలు తీవ్రంగా కలత చెందారన్నారు. రివర్స్ టెండరింగ్‌తో తీవ్ర నష్టం జరిగిందని, ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా  రాష్ట్ర ఆర్థికస్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. కొద్దిసేపటిలో తన ప్రసంగాన్ని ముగించారు గవర్నర్.


ALSO READ: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

మరోవైపు బీఏసీ స‌మావేశానికి వైసీపీ డుమ్మా కొట్టింది. అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అంశాల‌పై స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న సమావేశానికి వైసీపీ రాలేదు. టీడీపీ నుండి పయ్యావుల‌, జ‌న‌సేన నుండి నాదెండ్ల, బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు హాజ‌రయ్యారు.

 

 

Related News

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Vizag: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Aruna Custody: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు, వైసీపీ స్కెచ్ ఏంటి?

Village Clinics: ఏపీలో వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్‌

YSRCP: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..

Big Stories

×