BRS Public Meeting: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్ రజతోత్సవ సభలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. జిల్లాలో నుంచి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వెళ్తున్న కార్యకర్తల బస్సులను గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు.
రజతోత్సవ సభలకు హాజరవ్వడంపై గ్రామస్థులు ఫైర్
గ్రామ సమీపంలోని ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గత 80 రోజుల నుంచి అఖిలపక్ష నాయకత్వంలో జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ పోరాటాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సభకు అటెండ్ కావడంపై గ్రామస్థులు తెగ ఫైర్ అవుతున్నారు.
బీఆర్ఎస్ సభకు వెళ్తున్న బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలోని ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 80 రోజులుగా ఆందోళనలు
ఓవైపు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీటింగ్ కు ఎలా వెళ్తారంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న… pic.twitter.com/8FspJtjFc4
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025
పార్టీల కన్నా.. మాకు ప్రాణాలే ముఖ్యం..
మాకు పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. ‘పార్టీల కన్నా.. మాకు ప్రాణాలే ముఖ్యం.. మా భవిష్యత్తును కాపాడండి’ అని నినాదాలు చేస్తూ బస్సు ఎదుట నిరసనకు దిగారు.
Also Read: Mallareddy dance: మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో మస్త్ వైరల్