Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) కి ఇటీవల ఈడీ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED ) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రమోషన్స్ లో మహేష్ బాబు పాల్గొని యాడ్ కూడా చేశాడు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి యాడ్ చేయడంతో ఆయన 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు అధికారులు తేల్చారు. అందులో రూ.3.9 కోట్ల చెక్ రూపంలో , రూ.2.4 కోట్లు క్యాష్ రూపంలో అందుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఏప్రిల్ 27న విచారణకు రావాలని అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది.
విచారణ ఎగ్గొట్టిన మహేష్ బాబు.. అరెస్టు తప్పదా?
ఈ మేరకు మహేష్ బాబు ఈడీ కి ఒక లేఖ కూడా రాశారు. మహేష్ తన మెయిల్ ద్వారా ఈడి అధికారులకు లేఖను పంపించినట్లు తెలుస్తోంది. ఇందులో విచారణకు హాజరుకానని , సినిమా షూటింగ్ కారణంగా మరో తేదీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఈడి అధికారులు ఏమని స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఆయన ఈ డి విచారణకు రాకపోతే అరెస్టు తప్పదు అనే కోణంలో కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి 29 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక మూడో షెడ్యూల్ హైదరాబాదులో వేసిన సెట్లోనే ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కున్న సాయి సూర్య డెవలపర్స్ ..
ఇకపోతే సాయి సూర్య డెవలపర్స్, సురాన గ్రూప్ సంస్థలు మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కున్నాయి. మోసపోయిన బాధితులు సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా పై హైదరాబాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా రంగంలోకి దిగిన అధికారులు వీరి మోసాలను బయటపెట్టారు.. ఇంకా తాము కొనుగోలు చేసిన రూ.3కోట్ల విలువైన స్థలానికి కావలసిన రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేదని, అది ఇంకొకరి పేరుపై రిజిస్ట్రేషన్ పూర్తయిందని.. ఆధారాలతో సహా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ ప్రమోటర్గా మారిన మహేష్ బాబుకి కూడా ఇందులో వాటా ఉందని, అందుకే ఆయనకు నోటీసులు కూడా పంపించారు . మరి విచారణకు ఎగ్గొట్టిన మహేష్ బాబు నెక్స్ట్ విచారణలో ఎలాంటి సమాధానం తెలుపుతారో చూడాలి.
also read:Sekhar Master: ఆ అదృష్టం నాకే దక్కింది.. తండ్రీకొడుకులతో..!