BigTV English

Significance of Ugadi: యుగయుగాల ఉగాది.. వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా..?

Significance of Ugadi: యుగయుగాల ఉగాది.. వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా..?
Significance of Ugadi
Significance of Ugadi

The Story & Significance of Ugadi: హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగా ఉగాది. ఉగాది తోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. “యుగాది” అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాలమానాన్ని గణించడానికి ఇది తొలిరోజు. శిశిర రుతువు అంటే ఆకురాలు కాలం అని అర్ధం. ప్రకృతి చలితో గడ్డకట్టిపోతుంది. మోడు బారిపోతుంది. దీని తర్వాత వసంత కాలం వస్తుంది. వసంతాగమనంతో ప్రకృతి ఒక్కసారిగా పచ్చదనంతో పులకిస్తుంది. కోకిలలు ఈ కొత్త సంవత్సరానికి చక్కని గీతాలతో స్వాగతం పలుకుతాయి.


చైత్రమాసం శుక్లప్లక్షం పాడ్యామి రోజున ఆ విధాత ఈ జగతిని సృష్టించాడని అందరు నమ్ముతారు. పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించి సముద్ర గర్భంలో దాగి ఉండగా మత్స్యవతారమైనటువంటి విష్ణువు సోమకుడిని వధించి బ్రహ్మకు వేదాలను తిరిగి అప్పగించి ఈ సృష్టిని బ్రహ్మ తిరిగి ప్రారంభించిన రోజుగా ఉగాదిగా అలా సోమకుని సంహరించి సృష్టి ప్రారంభమైన రోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది యుగమునకు ఆది ఉగాదిగా మన పురాణాలు చెబుతున్నాయి.

కలియుగం దోషసాగరమే అయినప్పటికీ కేవలం హరేకృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా మనిషి భవబంధ విముక్తుడై పరంధామానికి చేరతాడని శ్రీమద్భాగవతం చెబుతోంది. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. ఆ యుగ ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు తాను ముందుగా చెప్పినట్టు ఐదువందల సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికాడు. పూర్వపు కష్టాలను, భవిష్యత్తును గురించిన స్వప్నాలను ఒకటిగా కలిపి ప్రజలను ఒకటిగా కదిలించి ప్రజలను సంఘటితంగా నడింపించే పర్వగదినం.


Also Read: శనివారం నాడు శ్రీవారిని ఇలా పూజిస్తే… మీ అప్పుల బాధ మాయం

దీనికి సూచనగా కరృత్వపు అలుపు పులుపును, కొంత సత్ఫలితాల మాధుర్యాన్ని ఇచ్చే తీపి, వగరు, కలిపిన పచ్చడి సేవించే ఆచారం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పరమ పావనమైన ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చడిని శ్రీకృష్ణ భగవానుడికి నివేదించి, ప్రసాదంగా తీసుకోవాలి. హరేకృష్ణ మహామంత్రాన్ని చదవాలి.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×