Ugadi Horoscope 2025: ఆ రాశి వారిని పట్టి పీడిస్తున్న ఏడున్నరేండ్ల శని ఇక గుడ్‌బై చెప్పనుంది. ఇన్నేండ్లు పడిన కష్టాలకు కటీప్ చెప్పి కొత్త జీవితానికి స్వాగతం పలకనున్నారు. అవమానాలు, సమస్యలకు ఈ ఉగాది నుంచి సెండాఫ్ ఇవ్వనున్నారు. ఇక కొత్త సంవత్సరంలో ఆ రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఇంతకీ ఆ రాశి ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడున్నర సంవత్సరాలు.. ఆ రాశి వారు ఎదుర్కొన్న కష్టాలు ఇన్నీ అన్నీ కాదు.. అయిన వారి నుంచి.. కానీ వరకు నమ్మిన వ్యక్తుల నుంచే కాకుండా అపరిత వ్యక్తుల చేతిలో కూడా ఊహించని మోసాలకు, కుట్రలకు బలైపోయిన వారు ఇక ఈ తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ నుంచి తలెత్తుకుని బతికే రోజులు వస్తున్నాయి. ఏడున్నరేళ్లుగా మకరరాశి జాతకులను పట్టి పీడిస్తున్న శని భగవానుడు వారిని వదిలేసే సమయం ఆసన్నమైంది. ఈ నెల 29 నుంచి అంటే సరిగ్గా ఉగాది పండక్కి ఒక్కరోజు ముందే మకరరాశి జాతకులకు పట్టిన ఏలినాటి శని పూర్తి కానుంది. అందుకే మకరరాశి జాతకలు ఇక నూతన సంవత్సరానికి నూతనోత్సాహంతో వెల్‌కం చెప్పండి.
సాడేసాత్ వదిలిపోతున్న మకరరాశి రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం -8, వ్యయం -14, రాజపూజ్యం -4, అవమానం -5 గాను ఉన్నాయి. ఇక నెలల వారీగా మకరరాశి వారికి ఇలా ఉండబోతుంది.
ఏప్రిల్: వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, వ్యవహారాలలో విజయం చేకూరును. ధనలాభము, కీర్తి కలుగును. అన్ని రంగాల వారికి ఆనందంగా ఉంటుంది. సోమవారం శివుడికి, పూజలు చేస్తే ధనలాభములు కలుగును. ఆదివారములలో శివాలయంలోని నందిశ్వరునికి అభిషేకాలు చేస్తే.. వ్యవసాయవృద్ధి, ధనప్రాప్తి కలుగును.
మే: ఈ నెలలో ఆరోగ్యము, ధనాదాయము, అభివృద్ధి, సుఖ, సంతోషాలు కలుగును. ఆలయాలను దర్శించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు.. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శాంతి కొరకు శుక్రవారాలలో గోవును పూజించాలి. తవుడు, బెల్లం, నవ ధాన్యములు నివేదన చేయాలి.
జూన్ : ఈ నెలలో మానసిక బాధలు, హింసించు ఘటనలు జరుగును. బంధు మరణములు, ప్రయాణ ఇబ్బందులు, భయాందోళనలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగవచ్చును. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయాలలో ఉన్నవారు జాగ్రత్త వహించుట మంచిది. శనివారాలు నవగ్రహ పూజలు చేసుకుంటే భయాందోళలు, కష్టములు తొలగిపోవును.
జూలై: ఈనెల అన్ని రంగములవారికి ఆశించిన ఫలితములు ధన, కార్య, వ్యవహార రూపాలలో లాభించును. సంతాన మూలక ఫలితములు అనుకూలము. విద్యా సంబంధిత రంగాల వారికి అభివృద్ది. ఉద్యోగప్రాప్తి ఉన్నది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగాల వారికి శ్రమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
ఆగష్టు: ఈనెల కుటుంబము నందు ఔషధ సేవలు పెరుగును. ధన వ్యయము. గ్రహస్థితి మిశ్రమ స్పందన. బంధు వైరములు అధికం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగముల వారికి సకాలంలో ఆదాయం లభిస్తుంది. మంగళవారాలు పద్మ నాభుని దర్శనం చేసుకోవాలి. దీంతో ఉన్నత యోగ్యతలు, ధనవృద్ధి పొందగలరు.
సెప్టెంబర్: ఈనెల సాంకేతిక రంగంలో ధనాదాయము. దీర్ఘకాలిక అప్పులు తీరుస్తారు. కొత్త అప్పులు తీసుకుంటారు. కొత్త ఇళ్లు, స్థలాలు, భూములు కొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆదివారాలు గ్రామదేవతలకు పూజలు చేసి ప్రసాదం వితరణ చేసిన ఇంటిలో శాంతి నెలకొంటుంది.
అక్టోబర్ : ఈ నెల విద్యార్థులకు చికాకులు. నిరుద్యోగులకు సమస్యలు ఏర్పడును. స్థిరాస్తి విషయాలలో అనుకూలముగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. స్త్రీలతో సమస్యలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార వర్గముల వారికి మిశ్రమ ఆదాయం ఉంటుంది. బుధవారాలు బుధునికి ఉత్తరేణి పత్రీతో పూజలు చేసి పెసర అన్నం నివేదనము చేస్తే.. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
నవంబర్: ఈ నెలలో డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త బంగారు అభరణాలు కొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయాల్లో ప్రవేశిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు అధిక ఆదాయం వస్తుంది. గురువారము గురునికి పచ్చని పూలు, రావి ఆకులతో పూజలు చేసి శనగపప్పు, పూర్ణపు బూరెలు నివేదించినచో.. రాజయోగములచే ధనవంతుల అవుతారు.
డిశంబర్: ఈనెల ప్రయాణములలో శారీరక బాధలు ఎదుర్కొంటారు. చెడ్డ వారితో ఫ్రెండ్షిప్ చేయకపోవడం మంచిది. శారీరక ఆందోళనలతో ఆరోగ్యము దెబ్బ తింటుంది. ‘వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారములు రాణించక పోవచ్చును. స్త్రీతలో ఉన్న ప్రెండిషిప్ వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
జనవరి: ఈ నెల ఆరోగ్యము బాగుండును, స్త్రీ సౌఖ్యము, మాట పట్టింపులు తొలగును, శారీరక శ్రమ తగ్గును. ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. ఉన్నత వ్యక్తుల పరిచయం, జీవితం ఆనందంగా గడుపుతారు. శనివారములందు వేంకటేశ్వరుని దర్శనము, అయ్యప్పస్వామి దర్శనము సకల శుభములను కలుగచేయును. ధనప్రాప్తి కలుగును.
ఫిబ్రవరి: ఈ నెల అన్నిరంగములవారికి ధనాదాయము మిశ్రమము, వృత్తి వ్యాపారాలలో లాభం చేకూరును. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కొన్ని సమస్యలు వచ్చును. బుధవారము గణపతి పూజలు, బుధగ్రహ పూజలు ప్రసాద వితరణ చేసిన సకల విఘ్నములు తొలగి శుభములు కలుగును.
మార్చి: ఈ నెల ఆరోగ్యములో కొద్దిగా మార్పు రావచ్చును, మిశ్రమాదాయము, ఆదాయము కష్టముగా వచ్చును, శ్రమించుట ముఖ్యము. “వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు మిశ్రమముగా ఆదాయము వచ్చును. గురువారము రామాలయ దర్శనం, పూజలు, ప్రసాద వితరణము వలన సకల కష్ట నష్టములు తొలగును సర్వాభిష్టములు కలుగును.
ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి