BigTV English

Gajakesari Yoga: గజకేసరి యోగం వల్ల ఆగస్టు నెలలో వీరి జీవితంలో ఊహించని మార్పులు

Gajakesari Yoga: గజకేసరి యోగం వల్ల ఆగస్టు నెలలో వీరి జీవితంలో ఊహించని మార్పులు

Gajakesari  Yoga: ఆగస్టు మొదటి వారంలో నుంచి గజ కేసరి యోగం ఏర్పడుతుంది. బృహస్పతి, చంద్రుల కలయిక వృషభ రాశిలో ఉండటం వల్ల గజకేసరి యోగం మరింత ప్రభావంగా ఉండనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గజకేసరియోగం సంపద, గౌరవాన్ని ఇస్తుంది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారు నైపుణ్యాలను పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఉన్నత విద్యను కూడా పొందుతారు. ఈ యోగ ప్రభావంతో ఆగస్టు మొదటివారం మిథున, మకర, కర్కాటక రాశుల వారికి జ్ఞానం పెరుగుతుంది.


గురుడు, చంద్రుడి శుభ కోణంతో ఈ రాశలు వారికి పురోభివృద్ధి మెరుగుపడుతుంది. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సంపద పరంగా కూడా ఈ వారం చాలా బాగుంటుంది. ఆగస్టు నెలలో ఏ రాశుల వారి జీవితం గజకేసరి యోగం వల్ల ఊహించని మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఆగస్టు మొదటి వారంలో మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజుల్లో ఏదైనా యాత్రకు వెళ్లే ముందు దేవతలను స్మరించుకోవడం మంచిది. ఈవారం ఊహాగానాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం మంచిది. ఆఫీసుల్లో వచ్చే ఆటంకాలు వారం ప్రారంభంలో అంటే సోమవారం తర్వాత తొలగిపోతాయి. అనంరం చేసిన పనుల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
వృషభ రాశి:
ఆగస్టు మొదటి వారం వృషభ రాశి వారికి బాగుటంటుంది. మీ వ్యాపారంలో కొత్త విజయాలు పొందుతారు. అంతే కాకుండా చేసే పనుల్లో పురోగతి లభిస్తుంది. మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. పాత అలవాట్లను వదిలేయడం మంచిది . ఎందుకంటే ఇవి మీకు ప్రయోజనకరంగా ఉండవు. పని చేసే ప్రాంతంలో మీ సీనియర్లు మీ సామర్థ్యం లేదా ప్రతిభను పరీక్షించే అవకాశం ఉంది.
మిథున రాశి:
ఆగస్టులో జరిగే పోటీల్లో మీరు విజయం సాధిస్తారు .సాహిత్యం, సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారికి మేలు జరుగుతుంది. మీరు ఆస్తిలో, కుటుంబ విషయాల్లో కొత్త ప్రారంభాన్ని పొందుతారు, పెండింగ్ పనులు కూడా పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇతర వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడుగుతారు. అందుకే వరికి సహాయం చేయడానికి సమయం కేటాయించండి.
కర్కాటక రాశి:
ఆగస్టు మొదటి వారంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనకు సంబంధించిన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో కాస్త మెరుగ్గా ఉంటుంది. మీరు కొత్త కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తులతో కొత్త సంబంధాలను కూడా సృష్టించుకుంటారు.
సింహ రాశి:
గ్రహాల పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. మీతో మీరు వీలైనంత ఎక్కువ సమయం గడపండి. అంతేకాకుండా భార్యాభర్తలు ఒకరితో ఒకరు కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను పునర్నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించాలి.
కన్య రాశి:
ఆగస్టులో కన్య రాశి వారి ప్రవర్తన చాలా దూకుడుగా ఉంటుంది. అలాగే మీ వైవాహిక జీవితం కొంచెం చేదు కొంచెం తీపిగా లాగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి సమయమిది. అప్పుడే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురువారం రోజుల్లో సంబంధాల్లో వ్యతిరేకత ఉంటుంది. ఒకసారి మీ జీవితంలోకి ప్రవేశించిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
తులా రాశి:
జీవనోపాధి విషయంలో తులా రాశి జాతకులు తమ సహోద్యోగులతో సంయమనం పాటించాలి . అయితే ఈ వారం చివరలో మీరు కొంత నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ అనుభవం నుంచి సమాచారాన్ని పొందడంలో విజయం సాధిస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×