E-Paper
Advertisement

Tirumala Srivari wedding: తిరుమల శ్రీవారి పెళ్లి భోజనాల గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు 

Tirumala Srivari wedding: తిరుమల శ్రీవారి పెళ్లి భోజనాల గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు 

Tirumala Srivari wedding: తిరుమల శ్రీవారి పెళ్లి భోజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్వామివారి పెళ్లి విందుకు వచ్చిన అతిథులు కూర్చుంటే.. తిరుమల నుంచి శ్రీశైలం దాకా బంతి అయిదట. ఇక వంటలయితే ఏకంగా పాత్రలలో కాకుండా తీర్థాలలో చేయాల్సి వచ్చిందట. అంతమందికి వండటానికి పాత్రలు లేక అలా చేశారట. ఒక్కటేమిటి శ్రీవారి పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటే అబ్బురపడిపోవాల్సిందే.

కలియుగ వైకుంఠంనాథుడు శ్రీనివాసుని కళ్యాణ వైభోగం అంతా ఇంతా కాదు.. స్వామి వారి పెళ్లికి అంతా సిద్దం అయ్యాక ఇక వంటావార్పు గురించి పెద్ద చర్చే జరిగిందట. పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అంత మందికి వంట చేయడం ఒక ఎత్తు అనుకుంటూ ఎవరు చేస్తారా..? అని ఆలోచిస్తుంటే.. శ్రీవారు అగ్నిహోత్రుని వంక చూస్తే అగ్నిహోత్రుడు స్వామి నేను చేస్తాను! కానీ వంట పాత్రలేవీ అని అడిగాడట. దీంతో స్వామి.. వెంకటాచలం మీదున్న తీర్ధాలలో వంట వండండీ అని చెప్పారట. దీంతో అగ్నిహోత్రుడు పైన పాపనాశనంలో చింతపండు పిసికి పోసేయండి. కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడట. అలా ఓక్కో తీర్థంలో ఒక్కో వంటకం చేశారట. స్వామి పుష్కరిణిలో అన్నం వండితే.. పాపనాశనంలో పప్పు చేశారట. ఆకాశగంగలో బెల్లం పరమాన్నం చేస్తే.. దేవతీర్ధంలో కూరలు వండారట. ఇంకా తుంబుర తీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో భక్ష్యాలు, (గారెలు, బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి) పాండు తీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాలలో లేహ్యాలు మొదలైనవి తయారు చేశారట.

భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు:

భోజనాలు సిద్ధం అయిన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేశాడట బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిధులందరికి వడ్డన చేయాలని కానీ తన ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా తాను భోజనం చేయడం తగదని అది సాంప్రదాయం కూడా కాదని స్వామి చెప్పడంతో.. మరి నివేదన చేయని పదార్థాలను అతిథులెవ్వరూ ముట్టుకోరు కదా..? మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మదేవుడు అడగ్గానే.. అదే శేషాచలం కొండ  మీద అహోబిలంలో నరసింహ స్వామి ఉన్నాడు కదా ఆయనకి నివేదన శ్రీవారు చెప్పారట. అతిథులు అందరినీ వరుసగా కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడట. పాండు తీర్థం ( గోగర్భం డ్యాం నుంచి దక్షిణంగా కొద్ది దూరంలో ఉంది. ఇప్పటికీ చూడవచ్చు.) శేషాచలం నుండి శ్రీశైలం వరకు విస్తళ్లను వేసి అతిధులందరూ ఆశీనులు అయ్యాక అందరికీ ఒకేసారి వడ్డించారట.

భోజనాలు వడ్డన:

ముందు విస్థళ్లపై నీరు తల్లి తుడిచి, పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కార పూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారట. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వెళ్లి వడ్డన పూర్తి అయిందన్న విషయం శ్రీవారికి చెబితే స్వామి వచ్చి అందరికీ ఉన్నంతలో ఏర్పాటు చేశాను. లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడట. అందరి భోజనాలు ముగిశాక, అందరికీ దక్షిణ తాంబూలాలు స్వయంగా శ్రీవారే ఇచ్చాడని పండితులు చెప్తుంటారు. అందరినీ భోజనం అయిందా అని ఒక్కొక్కరిని పేరుపేరునా అడిగిన తర్వాత శ్రీనివాసుడు, వకుళామాత, మన్మధుడు, లక్ష్మీదేవి,శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారట. అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్లి వారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరిందట. ఇలా స్వామి వారి పెళ్లిలో ఎంతో ఆశ్చర్యపరిచే సంప్రదాయమైన విశిష్టతలు ఉన్నాయని పండితులు చెప్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పెళ్ళైయ్యాక పూర్తిగా మారిపోయే జాతకులు ఎవరో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×